ఆంధ్రప్రదేశ్‌

బాబు జైలుకెళ్లడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 30: కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగేలా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మహారాష్ట్ర, కర్ణాటకలతో ఒప్పందాలు కుదుర్చుకుంటు అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తుంటే, అభ్యతరం తెలపవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసుకు భయపడి చేష్టలుడిగినట్లు వ్యవహరిస్తున్నారని, జరుగుతున్న అన్యాయంపై నోరు మెదిపే ధైర్యం లేకుండా పోయిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు కేసు విషయంలో ఏసిబి కోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని చెబుతు, ఈ కేసు ఎంత త్వరగా తేలితే అంత త్వరగా రాష్ట్రానికి పట్టిన చిక్కులన్నీ విడిపోతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ కేసు ఫైలు బయటకు వస్తే చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయమని అన్నారు. విజయనగరం పట్టణంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయ భవన నిర్మాణానికి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మంగళవారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతు కృష్ణా, గోదావరి నదులపై కట్టే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆమోదం, ఆంధ్రప్రదేశ్ అభిప్రాయం తప్పనిసరని, కానీ తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకుంటే అటు కేంద్రం, ఇటు ముఖ్యమంత్రి పట్టనట్లుగా వ్యవహరించటాన్ని తప్పుబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర మాట తప్పితే నిలదీయవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా సంజీవని కాదు అని వ్యాఖ్యానించటం శోచనీయమని అన్నారు.
కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడు వెళ్లిపోయినా పార్టీకి ఎటువంటి నష్టం లేదని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. మాజీమంత్రి దేవినేని, ఆయన తనయుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయంపై ఆయన స్పందిస్తూ దేవినేని తన మాటల్లోనే టిడిపిలో చేరటం సొంత ఇంటికి వెడుతున్నట్లుగా ఉందని చెప్పారని, మరి ఇన్ని రోజులు అద్దె ఇంట్లో ఉన్నట్లు భావించారేమోనని అన్నారు.

విజయనగరంలో మీడియాతో మాట్లాడుతున్న రఘువీరారెడ్డి