ఆంధ్రప్రదేశ్‌

సచివాలయం నుంచి పాలన ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 2:అమరావతిలోని తాత్కాలిక సచివాలయం నుంచి పాలన ప్రారంభమైంది. అమరావతిలోని వెలగపూడిలో ఐదు బ్లాకుల్లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 27 నుంచి ఇక్కడి నుంచి పాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. ఉద్యోగులైతే వచ్చారు కానీ, భవనాలు అప్పటికి పూర్తికాలేదు. సిఎం స్వయంగా పర్యవేక్షణ ప్రారంభించడంతో పనులు వేగవంతం అయ్యాయి. దాదాపూ మంత్రులందరూ తమ తమ ఛాంబర్లను సిద్ధం చేసుకున్నారు. ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కావల్సి ఉంది. గురువారం నుంచి సచివాలయంలో మంత్రులు సమీక్షలు మొదలుపెట్టారు. సమాచార పౌర సంబంధాల మంత్రి పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం తన ఛాంబర్‌ను శాస్త్రోక్తంగా ప్రారంభించుకున్నారు. ఇక శుక్రవారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ, పబ్లిక్ అక్కౌంట్స్, పర్యాటక శాఖలకు సంబంధించి సమీక్షలు నిర్వహించారు. ఆ తరువాత హోం మంత్రి చినరాజప్ప నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసంపై సమీక్షించారు. ఇకపై అన్ని సమీక్షలు తాత్కాలిక సచివాలయంలోనే నిర్వహించనున్నారు. సచివాలయం పూర్తిస్థాయిలో సిద్ధం కావాలంటే, కనీసం మరో నాలుగు నెలలు పడుతుంది. డిసెంబర్ నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. మరోపక్క అసెంబ్లీ భవన నిర్మాణం కూడా సిద్ధమవుతోంది. ఈ భవనం కూడా డిసెంబర్ నాటికి పూర్తికానుంది.

చిత్రం... సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి