ఆంధ్రప్రదేశ్‌

ఇడుపులపాయలో వైఎస్‌కు కుటుంబ సభ్యుల నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులర్పించారు. వైఎఎస్ వర్ధంతి సందర్భంగా ఘాట్‌ను రంగురంగుల పూలతో అలంకరించారు. రాజశేఖర్‌రెడ్డి భార్య విజయమ్మ, తనయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి, జగన్ భార్య భారతి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్‌కుమార్, మాజీ ఎంపి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, మామ డాక్టర్ ఇసి గంగిరెడ్డి, ఎంపి వైవి సుబ్బారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఉదయమే ఘాట్‌కు చేరుకుని సమాధి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం సమాధి వద్ద కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న కుటుంబ సభ్యులు

సిజిఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్‌గా ధర్మారావు

విశాఖపట్నం, సెప్టెంబర్ 2: ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఏర్పడిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సిజిఆర్‌ఎఫ్)కు చైర్‌పర్సన్‌గా దుంపల ధర్మారావు శుక్రవారం నియమితులయ్యారు. సంస్థ తొలిసారిగా జిల్లా జడ్జి స్థాయి అధికారిని ఈ పదవికి నియమించింది. ఎపి గెజిట్ నోటిఫికేషన్-116ను అనుసరించి ఎపి విద్యుత్ నియంత్రణ మండలి రెగ్యులేషన్-3 ప్రకారం ఈ ఏడాది మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేయగా, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దుంపల ధర్మారావును నియమించింది. సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ ధర్మారావును నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా సెషన్ జడ్జిగా బాధ్యతలు నిర్వహించి గత ఏడాది మార్చిలో పదవీ విరమణ చేసిన ధర్మారావు ఎపి రాష్ట్ర జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆయన వెల్లడించారు. మూడేళ్లు ఆయన పదవిలో ఉంటారు.

సత్ఫలితాలిస్తున్న
బయోమెట్రిక్ హాజరు

విజయవాడ, సెప్టెంబర్ 2: టెక్నాలజీతో పాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల హాజరు విషయంలోనూ ఆధార్ బయోమెట్రిక్ అనుసంధానంతో పారదర్శక పాలనలో ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,01,298 మంది ఉద్యోగులు ఆధార్‌తో బయో మెట్రిక్ హాజరు వ్యవస్థతో నమోదు చేయించుకున్నారు. వీరిలో 74,181 మంది ఉద్యోగులు (70.83 శాతం) నిత్యం విధులకు హాజరవుతున్నారు. కర్నూలు జిల్లాలో 5910 మంది ఉద్యోగులు నమోదు చేయించుకోగా, 37.10 శాతం ఉద్యోగులు ఆధునిక బయోమెట్రిక్ పద్ధతిలో విధులకు హాజరవుతున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో నమోదు చేయించుకున్న 4467 మంది ఉద్యోగుల్లో 86.39 శాతం మంది ఉద్యోగులు ఈ విధానంలో విధులకు హాజరవుతున్నారు. కృష్ణా జిల్లాలో 16,657 మంది ఈ విధానంలో హాజరు నమోదు చేయించుకోగా, 81.89 శాతం మంది ఉద్యోగులు నిత్యం విధులకు హాజరవుతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 26,175 మంది ఉద్యోగులు బయోమెట్రిక్ విధానంలో నమోదు చేయించుకోగా, 80.11 శాతం విధులకు రెగ్యులర్‌గా హాజరవుతున్నారు. 80 శాతానికి పైగా బయోమెట్రిక్ విధానంలో విధులకు హాజరవుతున్న జిల్లాలు కర్నూలు, ప్రకాశం, విజయనగరం, కృష్ణా, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.