ఆంధ్రప్రదేశ్‌

పర్యాటకంలో స్విస్ ఛాలెంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 2: పర్యాటకరంగంలో సైతం ప్రభుత్వం స్విస్ ఛాలెంజి విధానాన్ని అవలంబించటం ద్వారా అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా, గోదావరి నదీ గర్భాల్లో ఉన్న వేలాది ఎకరాల దీవులలో పార్కులు.. రెస్టారెంట్లు.. స్టార్ హోటళ్లతో పాటు బోటు షికార్లను అందుబాటులోకి తెచ్చి ఉపాధి కల్పనతో పాటు సేవల రంగం ద్వారా వృద్ధిరేటు సాధించేందుకు ప్రణాళిక సిద్ధమయింది. ఇందులో భాగంగా వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో అనేక ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. ప్రభుత్వం ఇప్పటికే 2015-20 టూరిజం పాలసీని ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటక రంగంలో అభివృద్ధి సాధించేందుకు అవసరమైన రాయితీలను ప్రకటించింది. గత రెండున్నరేళ్లుగా పర్యాటక రంగం వెనుకబడి ఉందనే అభిప్రాయం మంత్రివర్గ ఉపసంఘం భేటీలో వ్యక్తమయింది. పర్యాటకంగా ఆకర్షణీయమైన ప్రదేశాలు.. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ నిర్వహణ లోపం కారణంగా ఆదాయం సమకూరటంలేదనే భావనతో స్విస్ ఛాలెంజి విధానాన్ని అవలంబించాలని నిశ్చయించారు. కృష్ణా నదిలో విజయవాడ వద్ద సుమారు మూడువేల ఎకరాలకు పైగా ఉన్న దీవులతో పాటు భవానీ ద్వీపాన్ని ప్రైవేటు సంస్థలకు స్విస్‌ఛాలెంజి ద్వారా టెండర్లు పిలుస్తామని మంత్రి యనమల వివరించారు. ఇదిలా ఉండగా ఉండవల్లి, కొండపల్లిఖిల్లా, పల్నాడు ప్రాంతంలోని ఎత్తిపోతల, ఇంకా పలు ప్రాంతాలలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. సముద్ర తీరంలో విశాఖపట్నం ఇప్పటికే పర్యాటకంగా అభివృద్ధి చెందింది. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు పర్యాటక శోభ కలిగిన ప్రాంతాల్లో బీచ్ కారిడార్లు, ఫిష్‌ల్యాండ్‌లు ఏర్పాటు చేయటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని భావిస్తున్నారు. పర్యాటక రంగాన్ని విస్తృతం చేయటం ద్వారా ఉపాధి కల్పన పెంచాలనేది ప్రధాన లక్ష్యం కాగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ రంగం ద్వారా సత్ఫలితాలు సాధిస్తే భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుందనేది ప్రభుత్వ భావన. యూరోపియన్ దేశాలు సింగపూర్, మలేషియా, బ్యాంకాక్‌లు పర్యాటక రంగం ద్వారానే అభివృద్ధి సాధించాయని స్విస్‌ఛాలెంజి విధానం అమలులో ఉంటే బాధ్యతతో పాటు పారదర్శకత ఉంటుందని మంత్రి యనమల వివరించారు.