ఆంధ్రప్రదేశ్‌

వాతావరణం అనుకూలించక... రోడ్డు మార్గంలో ప్రయాణించిన సిఎం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 13: పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలన, ఆధునాతన యంత్రాల ప్రారంభోత్సవానికి మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుగుప్రయాణంలో రోడ్డుమార్గాన విజయవాడకు చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా ఉదయం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు ప్రాంతం పరిశీలన, యంత్రాల ప్రారంభం, విలేఖరుల సమావేశం, అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీలతో సమీక్ష నిర్వహించారు. ఇవన్నీ పూర్తయ్యేసరికి సాయంత్రం 5.18 గంటలు అయింది. అ సమయానికి పోలవరం ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో హెలికాప్టర్ ప్రయాణానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు నిరాకరించారు. ఇలాంటి వాతావరణంలో ప్రయాణించటం శ్రేయస్కరం కాదని సూచించారు. దీంతో ముఖ్యమంత్రి తిరుగుప్రయాణానికి రోడ్డుమార్గాన్ని ఎంచుకున్నారు. అయితే తొలుత ఆయన రాజమండ్రి వెళతారని అధికారులు పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత గోపాలపురం, దేవరపల్లి, భీమడోలు, ఏలూరు మీదుగా ప్రయాణించారు. సిఎం పర్యటనలో ఉపయోగించే ప్రత్యేక ఆర్టీసీ బస్సులో ఆయన విజయవాడ చేరుకున్నారు. ఆయనతోపాటు సిఎం కార్యాలయ కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు డాక్టరు కాటంనేని భాస్కర్, అరుణకుమార్ బస్సులో ఉన్నారు.