ఆంధ్రప్రదేశ్‌

స్విస్ చాలెంజ్‌పై బాబు నోరు విప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన స్విస్ చాలెంజ్‌పై బహిరంగ ప్రకటన చేయాలని వైకాపా డిమాండ్ చేసింది. మంగళవారం ఇక్కడ వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 58 కంపెనీలను అమ్మేసిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. హైటెక్ సిటీ ఒక్కటే కట్టానని పదే పదే చెబుతున్నారని, స్విస్‌చాలెంజ్ అక్రమాలు జరిగాయని అభియోగాలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. అప్పీలుకు వెళ్లి స్టేను తొలగించుకోవాలని చూడడం దురదృష్టకరమన్నారు. రాజధాని నిర్మాణంలో రూ. 3137 కోట్ల అంతర్గత వౌలిక సదుపాయాలకు, మరో రూ. 5600 కోట్లు బయటి వౌలిక సదుపాయాలకు ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా 12వేల కోట్లు ప్రభుత్వమే పెట్టుబడిగా పెడుతుంటే, సింగపూర్ కంపెనీలు కేవలం రూ. 320 కోట్లు మాత్రమే పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. కాని ఏపి సర్కార్‌కు కేవలం 42 శాతం వాటా, సింగపూర్ కంపెనీలకు 58 శాతం వాటా ఇస్తున్నారన్నారు. ఇది దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని కుంభకోణమన్నారు. చంద్రబాబుకు ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత లబ్ధి ముఖ్యమన్నారు. ప్రభుత్వం సింగపూర్ కంపెనీకి 1690 ఎకరాలు ఇస్తే, అందులో 50శాతం 845 ఎకరాలే తిరిగి వస్తాయన్నారు. వాటిని కనీసం ఎకరాకు రూ.14 కోట్లకు అమ్మితేనే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్నారు. సింగపూర్ కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు చెల్లించకపోయినా, 20 సంవత్సరాల్లో ఎలాంటి సమస్య వచ్చినా భరించేది రాష్ట్రప్రభుత్వమేనన్నారు. స్విస్ చాలెంజ్ పద్ధతి లోపభూయిష్టమని కేల్కర్ కమిటీ 2015లో చెప్పిందన్నారు. సింగపూర్ కంపెనీకే కాంట్రాక్టు దక్కే విధంగా నిబంధనలను, మార్గదర్శకాలను ఖరారు చేశారన్నారు. కోర్టుల్లో స్టే తెచ్చే ప్రయత్నాలు ఆపి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. న్యాయస్థానం లేవనెత్తిన అంశాల మీద, తాము వేసిన ప్రశ్నల మీద ప్రభుత్వం బదులివ్వాలని ఆయన కోరారు.