ఆంధ్రప్రదేశ్‌

‘పల్నాడు’ వలస బాట! ... దుర్భిక్ష ‘సాగర్’-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు పల్నాడును వదిలి వేరే ప్రాంతాలకు వలసపోతున్నారు. సాగర్ జలాశయం నుంచి నీరు విడుదల కాకపోవడంతో వ్యవసాయం దుర్భరమైపోయింది. పంటలు పండక, పశువులను పోషించలేక ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. పల్నాడులోని వివిధ మండలాల్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో 35వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 25వేల ఎకరాలు సాగర్ కుడి కావల పరిధిలోని అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలో వరి సాగు చేసేవారు. మిగిలిన 10వేల ఎకరాల్లో మిర్చ, పత్తి, మినుము, కంది, పెసర పండించేవారు. మూడేళ్లుగా సాగర్ నీరు అందకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మాగాణి భూములు కావడం వలన వరి తప్ప వేరే పంటలేవీ ఇక్కడ పండించలేకపోతున్నారు. ఈ ఏడాది తొలకరిలో సాగు చేసిన మినుము, పెసర, కంది పైర్లు సకాలంలో వర్షాలు కురియకపోవడంతో ఎండిపోయాయి. లేత కందిపైరు ఉరకెత్తి రైతులకు నష్టాన్ని మిగిల్చింది. శని, ఆదివారాల్లో కురిసిన వర్షం కారణంగా ఉన్న పంట కాస్తా నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. నూజెండ్ల మండలంలో 65 వేల ఎకరాల్లో ఆయకట్టు భూమి ఉంది. ఈ భూమి గత మూడేళ్లుగా సాగుకు నోచుకోలేదు. దీంతో రైతులు సుబాబుల్, జామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు. 48 వేల ఎకరాలు మాగాణి భూమి. 17 వేల ఎకరాల మెట్ట భూముల్లో పైర్లు సాగు చేయాల్సి ఉంది. అయితే సాగర్ జలాలు విడుదల కాకపోవడంతో పంటలు వేయలేకపోయారు. దీంతో సన్న, చిన్నకారు రైతులు వలస బాట పట్టారు. జెసి నగర్, రాముడు తండా, తంగిరాల, పాతనాగిరెడ్డిపల్లి, పమిడిపాడు, పువ్వాడ గ్రామాల నుంచి రైతులు వలస వెళుతున్నారు. శావల్యాపురం మండలంలో 25వేల ఎకరాలు ఉండగా, అందులో 19వేల ఎకరాల్లో ఆయకట్టు భూములు ఉన్నాయి. ఆరు వేల ఎకరాల్లో మెట్ట పైర్లు సాగుచేస్తున్నారు. సాగర్ జలాలు రాకపోవడంతో మాగాణి భూములు బీడు భూములుగా మారిపోయాయి. అలాగే బొల్లాపల్లి మండలంలోని 35వేల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా, నీరు లేక ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి మళ్లిస్తున్నారు. ఇవి కూడా ఎంత వరకూ రైతులను ఆదుకుంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దశాబ్దాల కాలంగా సాగర్ ఆయకట్టు కింద లక్షలాది ఎకరాలు సాగవుతున్నాయి. మూడు సంవత్సరాల నుంచి ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదో అర్థం కావడం లేదు. వరికి నీరు ఇవ్వలేనప్పుడు కనీసం ఆరుతడి పంటలకైనా నీరు ఇచ్చే భరోసాను ప్రభుత్వం ఎందుకు కల్పించలేకపోతోందన్న విమర్శల్నుయి. కృష్ణా జలాల వివాదం, ఎగువ రాష్ట్రాలతో సమస్య పరిష్కారానికి మార్గాలను అనే్వషించకపోతే, నాగార్జునసాగర్ జలాశయం ఒక మాన్యుమెంట్‌గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

కూలీలుగా మారుతున్నారు
మూడేళ్ల నుంచి సాగర్ నీరు విడుదల కాకపోవడం వలన రైతులు వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. కౌలు రైతులు కూలీలుగా మారిపోతున్నారు. వ్యవసాయం తప్ప వేరే పని ఎరుగని మేం ఇప్పుడేం చేయాలో తెలియని దయనీయ పరిస్థితుల్లో ఉన్నాం. రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటున్న చంద్రబాబు సాగర్ రైతులను ఆదుకోవలసిన అవసరం ఏర్పడింది.
--దాసరి కోటేశ్వరరావు,వెల్లటూరు.

ఎన్నడూ లేనంత దిగులు
నాకు ఐదు ఎకరాల మగాణి భూమి ఉంది. మూడేళ్లుగా సాగర్ నీరు విడుదల కాకపోవడం వలన పంటలు సాగుచేయలేకపోతున్నాం. ప్రత్యామ్నాయ పంటలు పండించాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. సాగర్ నీరు వచ్చినంత కాలం దిగులు లేకుండా ఉన్నాం. గతంలో ఎన్నడూ లేనంత దిగాలుగా రైతులంతా ఉన్నారు. సాగర్ నీరు లేక, వర్షాలు కురవకపోవడంతో పెట్టుబడులు పెట్టడం కూడా దండగనే అనిపిస్తోంది.
--గంధం బాలిరెడ్డి, పుచ్చనూతల.

టీ అమ్ముకుంటున్నాం
మూడు సంవత్సరాలుగా సాగర్ నీరు విడుదల కాకపోవడంతో వలన పొలాలను బీడుపెట్టి, టీ స్టాల్ నడుపుకొంటున్నాను. చాలా కాలంగా తాను వ్యవసాయం చేస్తున్నాను. గతంలో ఎప్పుడూ ఇంతటి దుర్భిక్ష పరిస్థితులు చూడలేదు. ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు కొనసాగితే, సాగర్ భూములన్నీ బీళ్లపోయాయి.
--రాజారపు పోలయ్య,బుర్రిపాలెం.

ఏజెన్సీల్లో వ్యాధుల నియంత్రణకు చర్యలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 14: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధుల తీవ్రత తగ్గించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. దీనిలోభాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాష్ట్ర స్థాయి వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల వైద్య బృందం మూడు రోజులపాటు పర్యటించనుంది. వైద్య, ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసరావు స్వయంగా ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి వ్యాధుల తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించనున్నారు. గత కొద్దిరోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో వ్యాధుల తీవ్రత, డెంగ్యూ, అంటువ్యాధులు ఎక్కువుగా ప్రబలడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రబలుతున్న వ్యాధులు, మరణాల వివరాలను వాస్తవ దృశ్యాలతోపాటు పత్రికాప్రకటనలు సైతం సిఎం డాష్‌బోర్డుకు పిర్యాదుల రూపంలో అందడంతో ముఖ్యమంత్రి ఈ విధమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిసింది.