రాష్ట్రీయం

రామలింగరాజుకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు బి రామలింగరాజుకు పాస్‌పోర్టును తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు గురువారం ప్రాసిక్యూషన్‌ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్ ఈ ఆదేశాలను జారీ చేశారు. తనకు పాస్‌పోర్టు ఇప్పించాల్సిందిగా బి రామలింగరాజు పెట్టుకున్న అభ్యర్ధనను కింది కోర్టు డిస్మిస్ చేసింది. పెండింగ్‌లో కేసు విచారణ ఉన్న కోర్టులకే అభ్యర్థన పెట్టుకోవాలని, ఇతర డాక్యుమెంట్లను జతపరచాల్సి ఉంటుందనే కారణంపై దిగువ కోర్టు ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి తన ఆదేశాల్లో ‘దిగువ కోర్టుకు పాస్‌పోర్టును అభ్యర్ధనను తిరస్కరించే అధికారం లేదని, ఈ కేసులో అన్ని డాక్యుమెంట్లను అపిలేట్‌కోర్టుకు పంపాలని చెప్పడం సరికాదని పేర్కొన్నారు.