రాష్ట్రీయం

ఉజ్వల భవిష్యత్‌ను అందించాలంటే...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 88 శాతం మంది తల్లులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించాలని కోరుకుంటున్నా దానిని ఎలా అందించాలో ప్రస్తుతం వారికి తెలియదని హంస రీసెర్చి గ్రూప్ ప్రైవేటు లిమిటెడ్ భాగస్వామ్యంలో రిన్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. యువతకు 21వ శతాబ్దంలో జీవన కౌశల్యంతో స్ఫూర్తిని , విద్యను అందించేందుకు రిన్ మరోమారు తమ సామాజిక చైతన్య కార్యక్రమం రిన్ కెరీర్ రెడీ అకాడమిని ప్రారంభిస్తోందని కూడా ప్రకటించింది. భారతదేశంలో ఉపాధి అవకాశాల రంగం ఒక వేదిక కాగానిరుద్యోగం కన్నా ఉపాధి అవకాశాలు తక్షణమే అందుబాటులో లేకుండా ఉండటమే ఒక సమస్యగా ఉందని, నేటి యువతలో కౌశల్య లేమి సమస్య తీవ్రంగా ఉందని భారతదేశంలోని కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు ఫిర్యాదు చేస్తున్నాయని ఈ సర్వేలో తేలింది. అంతేగాక, నిరుపేద మహిళల్లో ఈ నైపుణ్యలేమి అంతరం ఎక్కువగా ఉందని, అందుకే దేశంలో నైపుణ్య అభివృద్ధి అనేది అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశంగా మారిందని సర్వేలో వెల్లడైంది. ఉత్తమ భవిష్యత్ పొందాలంటే ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి అని లేదా చాలా ప్రాముఖ్యత ఉంటుందని 35 శాతం మంది తల్లులు అభిప్రాయపడ్డారని, పనిచేసే చోట చక్కగా దుస్తులను ధరించడం తాము చెప్పే అంశాలను నైపుణ్యంతో చెప్పగలగడం ద్వారా ఒకరిపై అభిప్రాయాన్ని ఏర్పరుచుకునేందుకు అవకాశం ఉంటుందని 93 శాతం తల్లులు పేర్కొన్నారు. తమ పిల్లలు ఉజ్వల భవిష్యత్‌కు అనుగుణమైన, సరైన శిక్షణ ఇప్పించేందుకు ఆర్థిక సమస్యలు, వనరుల లేమి వేధిస్తోందని 91 శాతం మంది తల్లులు తెలిపారని సర్వేలో వెల్లడైంది. తల్లుల ఆకాంక్షలకు అనుగుణంగా రిన్ కెరీర్ రెడీ అకాడమి అక్టోబర్‌లో ప్రారంభం కానుందని ఆసక్తి ఉన్న వారు 1800-267-1001 నెంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుందని సంస్థ పేర్కొంది.