రాష్ట్రీయం

సమాచార దొంగలున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఐటి కంపెనీల్లో సున్నితమైన డాటాను థర్ట్‌పార్టీ వెండర్లు తస్కరిస్తున్నారని ఐటి కంపెనీలకు చెందిన ప్రతి నలుగురు నిపుణుల్లో ఒకరు అభిప్రాయ పడుతున్నారు. ఈ వివరాలపై సెక్లోర్ట ఎంటర్ ప్రైజస్ స్ట్రాటెజీ గ్రూపు 200 ఐటి నిపుణులతో మాట్లాడి సర్వే చేసింది. సున్నితమైన సమాచారాన్ని కోల్పోవడం ఎక్కువ ఆందోళన కలిగిస్తోందని, తమ సమాచారాన్ని థర్ట్ పార్టీ వెండర్లు తస్కరిస్తున్నారనే నమ్ముతున్నట్లు ఐటి నిపుణలు పేర్కొన్నారు. ప్రతి నలుగురు ఐటి నిపుణుల్లో ఒకరు ఈ అభిప్రాయంతో ఉన్నారు. ఈ మెయిల్స్ పొరపాటున ఇతరులకు పంపడం వల్ల సమాచారం లీక్ అవుతోందని 67 శాతం మంది, అనవసర వ్యక్తులకు ఇమెయిల్స్‌తో అనుసంధానం కల్పించడం వల్ల 64 శాతం మంది, పోర్టబుల్ స్టోరేజి పరికరాల వల్ల సమాచారం లీకవుతోందని 61 శాతం విశ్వసిస్తున్నారు. కీలకమైన సమాచారం కలిగి ఉన్న ఫైల్స్‌ను భాగస్వాములు, కాంట్రాక్టర్లు, కస్టమర్లు దొంగిలిస్తున్నట్లు 56 శాతం మంది విశ్వసిస్తున్నారు. ఫైల్స్‌ను ఉద్యోగులే దొంగిలించడం, కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్ వాడకం వల్ల సమాచారం లీకవుతోందని ఐటి నిపుణులు భావిస్తున్నరు. సున్నితమైన డాటా రక్షించుకోవాలని, సమాచారాన్ని పంపడం, పంచుకోవడం, సహకారం కోసం వినియోగిస్తున్న సమయంలో పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందని సెక్లోర్ సిఇవో విశాల్ గుప్తా తెలిపారు. వచ్చే జనరేషన్ డాటా సెంట్రిక్ సెక్యూరిటీ పరిష్కారాలు వ్యూహాత్మంగా ప్రణాళిక చేసి భద్రతా ఆర్కిటెక్చర్ కలిగి ఉండడం అవసరమని ఆయన అన్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులతో మాట్లాడి సర్వే చేశామని ఆయన చెప్పారు.