రాష్ట్రీయం

పాతాళానికి భూగర్భజలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో భూగర్భజలాలు పాతాళానికి చేరుకున్నాయి. వీటిని పైకి రప్పించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో కాని ప్రస్తుతం భూగర్భ జలాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. నిత్యం నిండుగా గోదావరి ప్రవహించే ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం భూగర్భ జలాలు అట్టడుగుకు చేరాయని అధికారుల రికార్డులు వెల్లడిస్తున్నాయి. భూగర్భజలాలు ఐదు నుంచి ఎనిమిది మీటర్ల స్థాయిలో ఉంటే ఇబ్బంది ఉండదని, అయితే ఇలాంటి ప్రాంతాలు రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 30 నుంచి 100 అడుగుల లోతున భూగర్భజలాలు ఉన్న 100 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. వీటిలో 57 రాయలసీమలో ఉండగా ఉభయగోదావరి జిల్లాల్లో 13, శ్రీకాకుళం జిల్లాలో ఒక చోట ఉండగా మిగిలినవి ఇతర జిల్లాల్లో ఉన్నాయి. ఇక అత్యంత లోతులో భూగర్భజలం ఉన్న ప్రదేశంగా చిత్తూరు జిల్లా గుర్రంకొండ గ్రామం. ఈ గ్రామంలో భూ ఉపరితలానికి దిగువన 81.60 మీటర్ల లోతులో జలం ఉంది. ఆ తరువాతి స్థానాలు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో 73.86 మీటర్లు, అనంతపురం జిల్లా లేపాక్షి మండలం శిరివరం గ్రామంలో 67.81 మీటర్ల లోతున భూగర్భజలాలు ఉన్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలో సగటున 150 గ్రామాలను గుర్తించి నిత్యం భూగర్భజలాలను పరిశీలిస్తుంటారు. దీనికి సంబంధించిన నివేదికలు ఎప్పటికపుడు ప్రభుత్వానికి పంపుతుంటారు. రాష్ట్రంలో అత్యంత లోతులో భూగర్బజలాలు ఉన్న ప్రాంతాల నివేదికను పరిలీస్తే రాయలసీమలో దారుణమైన పరిస్థితి ఉంది. అనంతపురం ప్రథమ స్థానంలో ఉంది. 28 ప్రాంతాల్లో భూగర్భజలం అత్యంత లోతున ఉంది. ఈ జిల్లాలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా సాధారణ స్థాయి ఎనిమిది మీటర్ల దిగువన నీరు లేకపోవడం దయనీయ పరిస్థితిని గుర్తుచేస్తోంది. అనంతపురం జిల్లాలో అధికారులు గుర్తించిన భూగర్భజలాలను పరిశీలిస్తే కనిష్టంగా 15 మీటర్ల దిగువన నీళ్లున్నాయి. ఇక కడప జిల్లాలో 13 చోట్ల, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఎనిమిది ప్రాంతాల్లో భూగర్భ జలాలు అత్యంత లోతున ఉన్నట్లు అధికారుల రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాలో 16 ప్రాంతాల్లో భూగర్భజలాలు అత్యంత దిగువన ఉన్నాయి. ఇందులో 13 ప్రాంతాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. కనిష్టంగా పెదపాడు మండలం కొక్కెరపాడు గ్రామంలో 32.14 మీటర్ల దిగువన ఉండగా గరిష్టంగా కొయ్యలగూడెం గ్రామంలో 73.86 మీటర్ల దిగువన నీళ్లున్నాయి.