ఆంధ్రప్రదేశ్‌

విజృంభిస్తున్న డెంగ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 16: అనంతపురం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ రోగాలతో జనం విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా అనంతపురం నగరానికి చెందిన ఇద్దరు చిన్నారులు డెంగ్యూతో మృతి చెందడంతో జిల్లా యంత్రాంగం కదిలింది. నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉంటున్న ఖలందర్ కుమారులు ఇద్రీస్(12), మహ్మద్ జువేద్(10)కు జ్వరం రావడంతో స్థానికంగా చికిత్స చేయించారు. డెంగ్యూ అని వైద్యులు తేల్చడంతో బెంగళూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఇద్దరూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ కోన శశిధర్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ శుక్రవారం కాలనీకి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కాలనీలో పందుల స్వైర విహారం చేస్తున్నాయని, మురుగునీటి పారుదల సౌకర్యం లేక దోమలు విభృంభిస్తున్నాయని స్థానికులు మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. విషజ్వరాలు ప్రబలుతున్నా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ఆరోపించారు. దీంతో స్పందించిన అధికారులు ఈ సంఘటనకు బాధ్యుల్ని చేస్తూ రెండో డివిజన్‌కు చెందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు వేశారు. అదే విధంగా హెల్త్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్‌రెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్ గంగిరెడ్డికి చార్జ్ మెమోలు జారీ చేశారు. పట్టణాలు, పల్లెల్లో పరిస్థితి ఒకేలా ఉంది. జిల్లాలో సుమారు 506 మలేరియా, 144 డెంగ్యూ కేసులు నమోదైనట్లు సమాచారం. మలేరియా, టైఫాయిడ్ కేసులు వేలాదిగా నమోదవుతున్నాయి. డెంగ్యూ బాధితులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తుండడంతో వెలుగులోకి రావడం లేదు.
కర్నూలు జిల్లాలో విష జ్వరాలు
కర్నూలు: కర్నూలు జిల్లాలో విషజ్వరాలు రోగులను వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పారిశుద్ధ్యం సమస్య తీవ్రం కావడంతో జ్వరాలు విభృంభిస్తున్నాయి. తాగునీరు కలుషితం కావడంతో వాంతులు, విరేచనాలు, దోమలు పెరగడంతో డెంగ్యూ, మలేరియాతో జనం మంచం పడ్డారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నాటికి సుమారు 370 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కర్నూలు నగరంలోని బి.తాండ్రపాడు సమీప కాలనీల్లో మలేరియా విజృంభిస్తోంది. మురికినీరు నిల్వ ఉండడంతో ఇక్కడ దోమలు పెరుగుతున్నాయి. ఏడాది ఇక్కడ దాదాపు 355 మలేరియా కేసులు నమోదయ్యాయి. అదే విధంగా జిల్లాలోని అహోబిలం, తిమ్మాపురంలో డెంగ్యూ, మెదడువాపు, చికున్‌గన్యా కేసులు నమోదయ్యాయి. విషజ్వరాలు సోకిన ప్రజలు పదుల సంఖ్యలో నిత్యం ప్రభుత్వ ఆసుత్రుల్లో చికిత్స పొందుతున్నారు
శ్రీశైలం జలాశయానికి భారీ వరద
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు/శ్రీశైలం, సెప్టెంబర్ 16: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయానికి మళ్లీ నీటి రాక మొదలైంది. శుక్రవారం 85,833 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జలాశయం పూర్థిస్తాయి నీటిమట్టం 885 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 870.40 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా 143.41 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ జూరాల నుంచి 69,780 క్యూసెక్కులు, రోజా నుండి 12,933 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 31 వేల క్యూసెక్కుల నీరు జలాశయం చేరుకుంటోంది.