రాష్ట్రీయం

విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడేందుకు కార్యకర్తలు సమాయత్తం కావాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. పార్టీ తరఫున ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. సోమవారం మొదటి రోజున ముగింపు సమావేశంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ దేశ ప్రజల మధ్య బిజెపి విద్వేషాలు రెచ్చగొడుతున్నదని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పేదల పక్షాన నిలబడితే, బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నదని దుయ్యబట్టారు. కాశ్మీర్ ఘటన దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తెలంగాణ సిఎం కెసిఆర్ ఒకే వేదికపై పరస్పరం పొగుడుకుంటే, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారని ఆయన ఎద్దేవా చేశారు. మల్లన్న సాగర్ రైతుల పక్షాన పార్టీ నిలబడి పోరాడుతుందని ఆయన చెప్పారు. మార్కెట్ యార్డుల్లో ధరల నిర్ణయాధికారం రైతులకే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. నరేగా పథకంలో ప్రజాప్రతినిధులను ప్రభుత్వం కాలరాస్తున్నదని ఆయన విమర్శించారు. స్థానిక సంస్ధల బలోపేతానికి, వాటికి విధులు, నేరుగా నిధులు కల్పించేందుకు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యాంగంలోని 73, 74 అధికరణను సవరించారని ఆయన గుర్తు చేశారు. ఈ సవరణతో సకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మన ఊరు-మన ప్రణాళిక అని ప్రకటించినా ఆచరణలో లేదని విమర్శించారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీల సంక్షేమం కోసం మహిళా కాంగ్రెస్ పోరాటం చేయాలని ఆయన సూచించారు.
ఇలాఉండగా సోమవారం ఉదయం స్థానిక సంస్ధల ప్రజాప్రతినిధులు శిక్షణా కార్యక్రమం ప్రారంభోత్సవ సభలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రసంగిస్తూ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నేతృత్వంలోనే దేశాభివృద్ధి జరుగుతుందని అన్నారు. స్థానిక సంస్ధలకు కేంద్రం నేరుగా నిధులు ఇస్తున్నదని ప్రకటించినా, నీతి ఆయోగ్ వచ్చాక స్థానిక సంస్ధలకు నిధులు కరువయ్యాయని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల పర్యటన సందర్భంగా ఇస్తున్న హామీలేవీ నెరవేరడం లేదని అన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలో పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకే ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామని చెప్పారు.

గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించిన స్థానిక ప్రజాప్రతినిధుల
శిక్షణ శిబిరం వేదికపై ఎఐసిసి నేత దిగ్విజయ్ సింగ్‌తో ముచ్చటిస్తున్న
టిపిసిసి నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత జానారెడ్డి