రాష్ట్రీయం

ఐవైఆర్‌కు మంత్రి హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. కొత్త చీఫ్ సెక్రటరీగా ఎస్‌పి టక్కర్ నియామకానికి సిఎం చంద్రబాబు ఆమోద ముద్ర పడటంతోపాటు ఐవైఆర్ కృష్ణారావుకు కొత్త బాధ్యతలు అప్పగించారు. దేవాదాయ శాఖ అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి చైర్మన్‌గా ఐవైఆర్ కృష్ణారావును నియమించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగుతారు. దీంతోపాటు ఆయన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్‌గానూ కొనసాగుతారు. ఈ పదవి మూడేళ్లపాటు ఉంటుంది. ఈమేరకు ప్రభుత్వం జీవో 38, 39లను శుక్రవారం జారీ చేసింది. ప్రస్తుత వేతనం యథాతథంగా కొనసాగిస్తూనే మంత్రి హోదా కల్పించారు. మంత్రులకు కల్పించే అన్ని సదుపాయాలను ప్రభుత్వం ఆయనకు కల్పించింది. 8 వేల రూపాయల స్పెషల్ అలవెన్స్, 7 వేలు స్టాట్యూటరీ అలవెన్స్, 15వేలు కనే్వయన్స్, సొంత కారు ఖర్చులు 30 వేలు, అద్దె 50 వేలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, 50 వేలు ల్యాప్‌టాప్‌కు అందజేస్తారు. అందులో పాతిక వేలు రుణంగానూ, పాతిక వేలు గ్రాంట్‌గా ఇస్తారు. గృహోపకరణాలకు 1.5 లక్షలు మంజూరు చేస్తారు. ఫర్నీచర్‌కు 3 లక్షలు ఇస్తారు. వీటితోపాటు ఒక ప్రైవేటు సెక్రటరీ, అదనపు పిఎస్, ఒక పిఎస్, ముగ్గురు అటెండర్లు, ఒక జమేదార్, ఒక డ్రైవర్, ముగ్గురు స్వీపర్లు, అదనపు డ్రైవర్ ఉంటారు. మూడు టెలిఫోన్ లైన్లు, రెండు సెల్‌ఫోన్లను కూడా ప్రభుత్వం అందజేయనుంది. వీటితోపాటు ఇతర సౌకర్యాలు అదనంగా ఉండనే ఉంటాయి.
కొత్త సిఎస్‌గా ఎస్‌పి ఠక్కర్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సత్యప్రకాష్ టక్కర్ నియమితులయ్యారు. 31న సాయంత్రం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు 31న పదవీ విరమణ చేయనున్నారు. 31 సెలవుదినం కావడంతో శనివారం సాయంత్రమే బాధ్యతలను అప్పగించనున్నారు. ప్రస్తుతం ప్రణాళికా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఠక్కర్ 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈమేరకు ప్రభుత్వం జీవో 226ను శుక్రవారం విడుదల చేసింది. యువజన సర్వీసులు, పెట్రోలియం శాఖల్లో నిష్ణాతులైన ఎస్‌పి ఠక్కర్ చాలాకాలం కేంద్రీయ సర్వీసుల్లో సేవలందించారు. కేంద్ర ఆర్ధిక శాఖ, యువజన సర్వీసుల శాఖ, పెట్రోలియం శాఖ, కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శాఖ, ప్రధాని కార్యాలయం, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖలో విశేష సేవలు అందించారు. ఫ్రెంచి భాషలో నిపుణుడైన ఠక్కర్, బిఏ హానర్స్ చేశారు. తర్వాత అంతర్జాతీయ వ్యవహారాల్లో పిజి డిప్లొమో చేశారు. 1980లో అసిస్టెంట్ కలెక్టర్‌గా తన సేవలు ప్రారంభించిన ఠక్కర్ తర్వాత పిడిగా, చీఫ్ రేషనింగ్ అధికారిగా పనిచేశారు. యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. 1986లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖలో ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. 1990లో గుంటూరు కలెక్టర్‌గానూ, 1993లో కేంద్ర ఆర్ధిక శాఖలో పనిచేశారు. 1994లో ప్రధాని కార్యాలయంలో పనిచేసిన ఠక్కర్, 2003లో యువజన సర్వీసుల శాఖ స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశారు. 2005లో యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్ జనరల్‌గానూ, 2008లో పెట్రోలియం శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. 2015 వరకూ కేంద్ర ఆర్ధిక శాఖలో సేవలందించారు. ప్రస్తుతం ప్రణాళికా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుత జాబితాలో ఆర్‌పి వతల్ తర్వాత డాక్టర్ ఐవి సుబ్బారావు, ఎఎస్ పరీడా, సి విశ్వనాథ్‌లు సీనియర్లుగా ఉన్నారు. తర్వాత ఆరోస్థానంలో ఎస్‌పి ఠక్కర్ ఉన్నారు. జాబితాలో ఠక్కర్ తర్వాతి స్థానంలో ఎన్ రమేష్ కుమార్, లింగరాజు పాణిగ్రాహి ఉంటారు.