రాష్ట్రీయం

సిసి టీవీ ఫుటేజ్ చూస్తే నిజమేంటో తెలుస్తుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 29: అక్రమ కేసులు బనాయిస్తే భయపడబోమని, ప్రభుత్వంపై నిరంతరం రాజీలేని పోరాటం చేసేందుకు సిద్ధమని రాజంపేట ఎంపి మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం బెయిల్‌పై విడుదలైన ఆయన చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న హరితా హోటల్‌లో శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు. విమానాశ్రయ మేనేజరు 16మంది బోర్డింగ్ ప్రయాణికులకు పాస్‌లు ఇవ్వలేదని తనకు తెలియడంతో బోర్డింగ్ పాస్‌లు ఎందుకు ఇవ్వలేదని తాను బహిరంగంగానే అడిగానన్నారు. మేనేజరు దురుసుగా ప్రవర్తించటంతో అందుకు తనకు క్షమాపణలు చెప్పారని ఎంపి మిథున్‌రెడ్డి చెప్పుకొచ్చారు. మేనేజరు ఆ రోజు మధ్యాహ్నం 2గంటల నుండి 8గంటల వరకు విమానాశ్రయంలో విధులు నిర్వహించారని, నేను ఆయనపై చేయి చేసుకుని ఉంటే ఆయన అంత ప్రశాంతంగా పనిచేయగలరా అని ప్రశ్నించారు. తాను దురుసుగా ప్రవర్తించి ఘర్షణకు పాల్పడితే సిఐఎస్‌ఎఫ్ బలగాలు ఊరుకుంటాయా అని పేర్కొన్నారు.
అసలు అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అవాంఛనీయ సంఘటనలు చిత్రీకరించేందుకు ఏర్పాటు చేసిన సిసి పుటేజి వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదన్నారు. మేనేజరును రుయా వైద్యశాలకు తరలిస్తే అక్కడి వైద్యులు ఆరోగ్యంగా ఉన్నాడని ధ్రువీకరించటంతో మరుసటి రోజు మేనేజరు తన విధులకు సైతం హాజరయ్యారన్నారు. మేనేజరు విధులకు హాజరవుతున్న విషయం తెలుసుకున్న చంద్రబాబు, ఆయన అనుచరగణం ఇతర రాష్ట్రంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి తప్పుడు ధ్రువీకరణ పత్రంతో బెయిల్ రాకుండా అడ్డగించారన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చేసిన ఉద్యమాల్లో చురుకుగా వ్యవహరించినందుకు అపుడు తనపై పెట్టిన కేసులతో చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడన్నారు.