ఆంధ్రప్రదేశ్‌

అప్‌డేట్ కాకుంటే అంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 5: ‘కొత్త విషయాలు తెలుసుకోవటం తేలికే, కానీ నేర్చుకోవటం అనుకున్నంత సులభం కాదు.. అదొక పెద్ద సమస్య... ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిగా మారి నేర్చుకోవటం వల్లనే అది సాధ్యపడుతుంది’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్బోధించారు. గుంటూరు జిల్లా కెఎల్ యూనివర్శిటీలో జరుగుతున్న శిక్షణ తరగతుల్లో రెండో రోజైన బుధవారం చంద్రబాబు ఆదేశాల మేరకు మొత్తం ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్‌పిటిసిలు, మున్సిపల్ చైర్మన్‌లు ప్రతి ఒక్కరూ పాఠశాల విద్యార్థులుగా మారి ట్యాబ్‌ల వినియోగంలో నిపుణులతో శిక్షణ పొందారు. నిజానికి మొదటిరోజే చంద్రబాబు తన ప్రారంభోపన్యాసంలో ‘ఈ తరగతుల్లో ప్రతి ఒక్కరూ ట్యాబ్ చేతబట్టుకుని శిక్షణ పొందాల్సిందే, లేనిపక్షంలో ఈ తరగతులను మరో రెండు రోజులు పొడిగిస్తా.
ఈ మూడు రోజులు కొంపలేమి ముంచుకుపోవు, సెల్‌ఫోన్‌లను దూరం గా ఉంచాలి’ అని సున్నితంగా చెప్పారు. తొలిరోజు రాత్రి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు విందు ఇస్తే రెండో రోజు చంద్రబాబు ఇచ్చారు. రెండోరోజు ప్రధానంగా ట్యాబ్‌ల వినియోగంపైనే చంద్రబాబు ఎక్కువగా మాట్లాడారు. ‘బెస్ట్ ప్రాక్టీసెస్‌లను రిక్షాపుల్లర్, రైతు, కార్మికుడి నుంచి కూడా నేర్చుకోవచ్చు. మనం రాజకీయాల్లో ఉన్నాం, పాలసీ మేకర్స్‌గా ఉన్నాం, మంచి ఆలోచన కుటుంబంలో అమలు చేస్తే కుటుంబం బాగుపడుతుంది. దేశంలో అమలు చేస్తే దేశం బాగుపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో టెక్నాలజీ విస్తరించింది. నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రారంభమయ్యింది. మీరు ఇప్పుడు కైజాలా నేర్చుకున్నారు. అదొక యాప్ మాత్రమే కాదు ప్లాట్‌ఫామ్ కూడా. అనేక రకాలుగా దానిని ఉపయోగించవచ్చు. మనం అనుకున్నది జరుగుతుందా అనే పరిస్థితి నుంచి, అనుకున్న ప్రతిదీ జరిగే పరిస్థితికి చేరుకున్నాం. అందుకే ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఫైబర్‌గ్రిడ్ ఒక ఇన్నోవేషన్ అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తే రూ.3వేల కోట్లు ఖర్చు అవుతుంది. అలాంటిది కరెంట్ స్తంభాల గుండా కేబుల్ వేసి రూ.300 కోట్లతో పూర్తి చేశాం. వచ్చే జనవరి 3న తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్‌కు ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నారు. ఆ లోపు రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు వైఫై సదుపాయం కల్పిస్తున్నామ’న్నారు. రెయిన్‌గన్ టెక్నాలజీ ఒక ఇన్నోవేషన్. పట్టిసీమ లిఫ్ట్ ఒక ఇన్నోవేషన్. రెయిన్ గన్ గురించి తెలుసా అని ప్రతిపక్ష నాయకుడు ఎగతాళి చేస్తున్నారు. అవినీతిలో తప్ప అభివృద్ధిలో ఇన్నోవేషన్ గురించి ఆయనకు తెలియదంటూ పరోక్షంగా జగన్‌పై నిప్పులు చెరిగారు. ఒక ఆలోచన తరతరాలుగా కష్టపడుతున్న సీమను కరువు నుంచి విముక్తి చేసేందుకు దోహదపడింది. రాష్ట్రంలో అన్ని ఇళ్లకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. రాష్ట్రంలో 20 లక్షల కనెక్షన్లు ఇస్తే 100 శాతం గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు అవుతుంది. 43 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. రేషన్ బియ్యం 4కిలోల నుంచి 5కిలోలకి పెంచాం. 2కోట్ల మందికి బీమా సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే అన్ని మున్సిపాల్టీలు, 1300 గ్రామాలు ఓడిఎఫ్‌గా ప్రకటించాం, దోమలపై దండయాత్ర కార్యక్రమం ఉద్యమంలా చేపడుతున్నాం. వనం-మనం, నగర వనం కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టుకు ఇచ్చి, కృష్ణానీటిని రాయలసీమకు మళ్లించి రాష్ట్రాన్ని సశ్యశామలం చేస్తున్నామన్నారు. అమేజాన్, ఉబర్, తదితర యాప్‌లు అన్నీ వినూత్న ఆలోచనల వల్లే ఆచరణ సాధ్యం అయ్యాయి. గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారిందన్నారు. మన రాష్ట్రంలో 10 వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతున్నామని, గ్రామాల్లో చెత్తాచెదారం నుంచి వర్మికంపోస్టు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతి గ్రామానికి రూ. 4 లక్షలు ఇస్తున్నామన్నారు.

చిత్రం... పార్టీ శ్రేణులకు కంప్యూటర్ శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న చంద్రబాబు