ఆంధ్రప్రదేశ్‌

ఎసి వేధింపుల వల్లే ఇవో మృతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), అక్టోబర్ 5: దేవాదాయ ధర్మాదాయశాఖలో పైస్థాయి అధికారుల వేధింపులతోనే ఇవో బొమ్మకంటి త్రిమూర్తులు మృతి చెందినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇవోల సంఘం ఆరోపించింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సంఘ నాయకులు తెలిపారు. పాతబస్తీలోని అసోసియేషన్ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ మల్టీజోన్ రీజనల్ జాయింట్ రీజనల్ జాయింట్ పరిధిలోని వైజాగ్ ఎసి అసిస్టెంట్ కమిషనర్ పుష్పవర్థన్ తన పరిధిలో ఉన్న ఇవోల జీతాలు నిలిపివేయటం, సమావేశాల్లో అకారణంగా ఇవోలు, తదితర సిబ్బందిపై దుర్భాషలాడడం, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈవిషయం పై అధికారులకు తెలిసినప్పటికీ వారు చూసిచూడనట్లుగా వ్యవహరించటంతో నిజాయితీ పరుడైన ఒక ఇవో మృతి చెందటానికి కారణమయ్యారన్నారు. సంఘం రాష్ట్ర సెక్రటరీ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఇవో త్రిమూర్తులు మరణం వెనుక ఉన్న కారణాలు, ఎసి పనితీరుపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి వినతి పత్రంతో పాటు దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కూడా వినతి పత్రాలు సమర్పించామన్నారు. ఈ వ్యవహారంపై న్యాయం జరగకపోతే ఆందోళన బాట పడతామని వారు హెచ్చరించారు.