ఆంధ్రప్రదేశ్‌

దూసుకొస్తున్న ప్రైవేట్ వర్శిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 5: వివిధ రాష్ట్రాలు ఇప్పటికే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు పెద్దపీట వేస్తున్న తరుణంలో రాష్ట్రంలో కూడా ప్రైవేట్ వర్శిటీల ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. దీంతో ఐదు వర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే 21 వర్సిటీలు దరఖాస్తు చేయగా, దాదాపు ఐదింటికి దాదాపు లైన్ క్లియర్ అవడంతో దూసుకొస్తున్నాయి. ప్రైవేట్ వర్సీటీల రాకతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వర్సిటీలపై ప్రభావం చూపనుంది. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే, ప్రభుత్వ వర్సిటీల మనుగడ ప్రశ్నార్థకం కానుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో 16 వర్సిటీలు ఉన్నాయి. ఇందులో సాంప్రదాయ వర్సిటీల సంఖ్య 10. వీటి నిర్వహణకు బ్లాక్ గ్రాంట్‌ను ప్రభుత్వం విడుదల చేస్తోంది. అయితే ఇందులో 90 శాతం నిధులు జీతాలు, పింఛన్లకే సరిపోతున్నది. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఏటా 290 కోట్ల రూపాయల మేకరు గ్రాంట్‌ను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. కానీ 300 కోట్ల రూపాయలు జీతాలు, పింఛన్ల కింద చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేట్ వర్సిటీల తరహాలో ఫీజులను పెంచుకునే వెసులు బాటు లేకపోవడంతో ప్రభుత్వ వర్సిటీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ప్రైవేట్ వర్సిటీలకు పెట్టుబడుల కొరత ఉండదని, ఫీజులు కూడా భారీగా ఉండటం వల్ల వాటితో పోటీ పడటం కష్ట సాధ్యమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పురాతన వర్సిటీలు తమకు కావాల్సిన నిధులను అవే సమకూర్చుకోవాలని ప్రభుత్వం సంకేతం ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలోని సంప్రదాయ వర్సిటీలపై ప్రభావం చూపనుంది. గతంలో ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ జలంధర్‌లోని ఒక వర్సిటీలో అధ్యయనం చేసింది. ఆ వర్సిటీలో 6000 మంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారు. అంత దూరం వెళ్లి అక్కడ చదవడానికి కారణాలపై కమిటీ సభ్యులు విద్యార్థులను, తల్లితండ్రులను ఆరా తీశారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో బోధనా ప్రమాణాలు సరిగా లేవన్న అభిప్రాయం వారు వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఇతర రాష్ట్రాల్లోని వర్సిటీల్లో తెలుగు విద్యార్థులు చేరుతున్నట్లు కమిటీ గమనించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య విజయప్రకాష్ తెలిపారు. రాష్ట్రంలో ప్రైవట్ వర్సిటీల ఏర్పాటు తథ్యం అని, ఆపడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సంప్రదాయ వర్సిటీలు నాణ్యతపై దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ వర్సిటీలతో పోటీ పడేందుకు ఇదే మార్గమని స్పష్టం చేశారు. నిధులను సొంత సమకూర్చుకునేందుకు దృష్టిసారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని వర్సిటీలు ఆర్ధికంగా బలోపేతానికి మార్గాలను అనే్వషించాలని స్పష్టం చేశారు.