ఆంధ్రప్రదేశ్‌

నవశకానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 12: ‘నూతన శకం ఆరంభమైంది.. అనేక ఒడిదుడుకులు అనుభవించాం.. గంపెడు కష్టాలతో తిరిగొచ్చాం.. అన్యాయం చేసి అవమానించారు.. అన్యాయాన్ని న్యాయంగా నిరూపించుకోగలం.. కానీ అవమానం భరించలేనిది.. అందుకోసమే పదేళ్లు హైదరాబాద్‌పై హక్కు ఉన్నప్పటికీ వదులుకుని ఈ నేల పైనుంచి పరిపాలన సాగిస్తేనే ప్రజలు ఆమోదిస్తారు, ఫలితాలు కూడా ఉంటాయనే లక్ష్యంతో 8 నెలల్లో సచివాలయ నిర్మాణాన్ని పూర్తిచేయటంతో పాటు పాలనా వ్యవస్థను కేంద్రీకృతం చేయగలిగాం’.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సచివాలయం ఒకటో బ్లాక్‌లో ఏర్పాటయిన తన చాంబర్‌లోకి పండితుల వేదమంత్రోచ్చారణల మధ్య బుధవారం ఉదయం 8.09 గంటలకు ఆయన ప్రవేశించారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, డిజిపి నండూరి సాంబశివరావులతో కలిసి ప్రభుత్వ విధివిధానాలపై ఈసందర్భంగా ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి లభ్యత వివరాలను డ్యాష్‌బోర్డులో ఆరా తీశారు. డ్వాక్రా మహిళలకు రెండో విడత రుణమాఫీగా ప్రకటించిన రూ. 3వేల కోట్లలో పెట్టుబడి రాయితీగా రూ. 2500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ సెక్రటేరియట్‌లో తొలి ఫైలుపై చంద్రబాబు సంతకం చేశారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తుపై స్పందించకుండా కొందరు రాజకీయ స్వలాభాపేక్ష కోసం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పచ్చని పంట పొలాల్లో రాజధాని కడుతున్నారంటూ కోర్టుల్లో వ్యాజ్యాలు వేయిస్తున్నారని, వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతంలో కాకుండా అడవుల్లో రాజధాని కట్టాలా? అని ప్రశ్నించారు. ‘్భకంపాలు, వరదలు వస్తాయని ఎవరు అంచనా వేశారు? చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలను వరదలు ముంచెత్తలేదా? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎదుర్కోగలిగే సామర్థ్యం పెంచుకోవాలి తప్ప అదే సాకుగా విమర్శలకు దిగడం మంచి సంప్రదాయం కాదు’ అని విమర్శకులకు చంద్రబాబు హితవు పలికారు. తమ కుతంత్రాలు ఫలించక పోవటంతో కులాలు, మతాలను చేరదీసి వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తూ వైషమ్యాలను పెంచుతున్నారని ప్రతిపక్ష పార్టీలపై ఆయన ధ్వజమెత్తారు. తెలుగు వారంతా గర్వించేలా రాజధాని ఉండాలనేది తన ధ్యేయమని చెప్పారు. ఇది నెరవేరాలంటే చాలా సమయం పడుతుందన్నారు. అందుకే పాలనా సౌలభ్యం కోసం తాత్కాలిక సచివాలయం నిర్మించామన్నారు.
నల్లధనం వెలికితీయండి
దేశ ఆర్థిక వృద్ధిరేటును దృష్టిలో ఉంచుకుని నల్లధనాన్ని పూర్తిస్థాయిలో వెలికితీసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. నిర్ణీత గడువు విధించి వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లను నిషేధించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. అవినీతికి తావులేకుండా అన్నీ ఆన్‌లైన్ లావాదేవీలు జరిగితేనే అభివృద్ధి వేగవంతమవుతుందని అభిప్రాయపడ్డారు. కొందరు సంపాదన కోసమే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు ఈవిషయంలో పోటీ పడుతున్నారని, విలువలు కోల్పోతే ప్రజలే చైతన్యవంతులై నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. దేశం మొత్తంగా హైదరాబాద్‌లో నల్లధనం రూ.13వేల కోట్లు బయటపడిందని, ఇది దేశ అవినీతిలో 20శాతమని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి వద్దే రూ.10వేల కోట్లు ఉన్నాయని చెప్తూ ఓ పారిశ్రామికవేత్తకో, వ్యాపారవేత్తకో ఈ స్థాయిలో సంపాదన సాధ్యపడదని స్పష్టం చేశారు. నల్లధనం కూడబెట్టేవారికి రాజకీయాలు అడ్డాగా మారాయని వ్యాఖ్యానించారు. ‘దేశానికి యువశక్తి, సమర్థవంతమైన నాయకత్వం ఉంది.. సాంకేతికత, మేథోసంపత్తి అందుబాటులో ఉన్నాయి.. సూపర్ పవర్‌గా భారత్ రెండంకెల వృద్ధిరేటుకు చేరుకునే అవకాశాలను అందిపుచ్చుకోవాలి’ అని చంద్రబాబు సూచించారు. అగ్ర దేశం అమెరికాకు సైతం నాయకత్వ సమస్య ఉందని చెప్పారు. చైనా ఆర్థిక వ్యవస్థ పతనమైన తరువాత ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. ద్రవ్య విలువ ఉన్నందునే విదేశీ లావాదేవీలు పెరిగాయని, దీన్నో విషవలయంగా ఆయన అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మీరు చేపట్టిన సంస్కరణలను స్వాగతిస్తున్నామంటూ ప్రధాని మోదీకి లేఖలో చంద్రబాబు అభినందనలు తెలిపారు.

చిత్రం... సచివాలయంలో సిఎం ఛాంబర్‌లో తొలి ఫైల్‌పై సంతకం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు