ఆంధ్రప్రదేశ్‌

పరీక్ష హాలులో అక్రమాలకు చెల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే ఎంపిక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే అభ్యర్థుల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు చట్టంలో మార్పులు తీసుకువచ్చింది. ఈ మేరకు మంగళవారం నాడు ఎపిపిఎస్‌సి గెజిట్ ప్రకటన చేసింది. అక్రమాలకు పాల్పడినట్టు తేలితే అభ్యర్థులను డిబార్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు కూడా వీలుకల్పించారు. అక్రమాలకు పాల్పడినట్టు అభ్యర్థులు అంగీకరించడం లేదా క్షేత్రస్థాయిలో అవసరమైన ఆధారాలు లభిస్తే సంబంధిత పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నేరుగా చర్యలు తీసుకునే అధికారాన్ని ఇచ్చారు. అక్రమాలను అభ్యర్థులు తిరస్కరించిన పక్షంలో వారం రోజుల పాటు గడువు ఇచ్చి విచారణ జరిపించి తగిన చర్యలకు సిఫార్సు చేసే వీలు కూడా కల్పించారు. అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులపై తుది చర్యల అధికారం ఎపిపిఎస్‌సి కార్యదర్శికి ఉంటుంది. దిగువస్థాయిలో మాల్ ప్రాక్టీస్ కమిటీ, స్క్రూటినీ కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలు జరిగిన దానిపై నివేదికలు స్వీకరించి వెను వెంటనే స్పందిస్తాయి. అక్రమాలకు పాల్పడుతున్న అభ్యర్థులను తక్షణమే పరీక్ష కేంద్రం నుండి వెలివేసే అధికారం కూడా చీఫ్ సూపరింటెండెంట్‌లకు అప్పగించారు. అభ్యర్ధులను డిబార్ చేయడంతో పాటు వారిని రెండేళ్ల పాటు ఏ ఎంపిక పరీక్షకు హాజరుకాకుండా నిరోధిస్తూ కూడా చర్యలు తీసుకోనున్నారు. జవాబు పత్రాలను మార్చినట్టయితే ఐదేళ్ల పాటు ఎంపిక పరీక్షలకు డిబార్ చేస్తారు. పరీక్ష హాలులో జరిగే 28 రకాల అక్రమాలకు వివిధ శిక్షలను కమిషన్ ఖరారు చేసింది. రానున్న రోజుల్లో వీటిని చాలా కఠినంగా అమలుచేస్తామని కమిషన్ అధికారులు పేర్కొన్నారు.