రాష్ట్రీయం

కాచిగూడ, టాటానగర్ మధ్య 12 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: ఈ నెల 21వ తేదీ నుంచి కాచిగూడ-టాటానగర్ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ట్రైన్ నెం. 07438 ఈనెల 21,28, డిసెంబర్ 5,12,19,26 తేదీల్లో కాచిగూడ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 13:00 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు 19:45 గంటలకు టాటానగర్ చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెం. 07439 టాటానగర్-కాచిగూడ ప్రత్యేక రైలు టాటానగర్ నుంచి 22,29, డిసెంబర్ 6,13,20,27 తేదీల్లో 22:50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు 05:00 గంటలకు కాచిగూడ చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్‌కోట్, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బెర్హంపూర్, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, సుకిందరోడ్డు, కెందుజ్‌గఢ్, జరోలి, బన్సపాని, చిబాస స్టేషన్లలో ఆగుతాయని, ఈ ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక చార్జీలు ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.