ఆంధ్రప్రదేశ్‌

కదంతొక్కిన అగ్రిగోల్డ్ బాధితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 9: అగ్రిగోల్డ్ బాధితుల ఆగ్రహం మరోసారి కట్టలు తెంచుకుంది. మంగళవారం వివిధ రాష్ట్రాల నుండి విజయవాడకు తరలివచ్చిన వేలాది బాధితులు టిడిపి ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. ఈ సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వమే అడ్డుకుంటోందని, దీని వెనుక పెద్ద కుట్ర దాగివుందంటూ దుమ్మెత్తి పోశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, బాధితులకు చెందిన డిపాజిట్ల మొత్తాన్ని యుద్ధ ప్రాతిపదికన చెల్లించకుంటే భవిష్యత్‌లో ఈ ప్రభుత్వం తలరాత మార్చుతామంటూ హెచ్చరించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుండి అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్, వారి కుటుంబ సభ్యులు వేలాదిగా తరలివచ్చారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి వెలగపూడి నూతన సెక్రటేరియట్ వరకు భారీ ప్రదర్శనగా వెళ్లి ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించారు. అయితే ముఖ్యమంత్రి అక్కడ లేనందున అగ్రి బాధితుల ఆందోళన విజయవాడకు పరిమితం అయ్యింది. ప్రభుత్వ ఆసుపత్రి నుండి లెనిన్ సెంటర్‌కు, అక్కడి నుండి సిఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లాలని ప్రయత్నించినా పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు.
తొలుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుండి ఉదయం 9 గంటలకే వేలాదిగా అగ్రి బాధితులు విజయవాడ చేరుకున్నారు. కళాక్షేత్రం ఎదురుగా గల ప్రభుత్వ పాత ఆసుపత్రి ఎదుట పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపుతో బాధితులంతా రోడ్డుకు ఒక వైపై బైటాయించారు. ఆందోళనకు సంఘీభావం తెలియజేసిన సిపిఐ, సిపిఎం, బిజెపి, కాంగ్రెస్, లోక్ సత్తా ప్రజా సంఘాల నాయకులు ఆ సభలో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి విజయవాడలోనే ఉన్నందున ఆయన్ను కలిసేందుకు ఓ పదిమంది ప్రతినిధులకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసు అధికారులను ముప్పాళ్ల, తదితర నాయకులు కోరారు. పోలీస్ అధికారులు మధ్యవర్తిత్వం నెరపి చంద్రబాబుతో చర్చించగా బాధితులను కలిసేందుకు ముఖ్యమంత్రి నిరాకరించారు.
దీంతో ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాహనాలను రప్పించి వివిధ పార్టీల, బాధితుల సంఘం నాయకులను, ఆందోళనకారులను పోలీసు వాహనాల్లో తోసేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు, పిసిసి అధికార ప్రతినిధి తులసీ రెడ్డి, ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గా భవాని, అనేక మంది నేతలను అరెస్టు చేశారు.

విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల భారీ ర్యాలీ