ఆంధ్రప్రదేశ్‌

‘రియల్ ఎస్టేట్’పై శరాఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 9: దేశంలో 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో దాని ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి శరాఘాతంగా మారింది. మరో ఏడాది వరకూ కోలుకోలేమంటున్నారు బిల్డర్లు. ఎకరాల కొద్దీ భూములు కొనుగోలు చేసి, వాటిని తిరిగి అమ్మలేక రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుప్పకూలిపోయారు. ప్రధానంగా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోడానికి రియల్ ఎస్టేట్ రంగం బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా బ్లాక్ చేయడానికి అవకాశం లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా దెబ్బతింటుందంటున్నారు వ్యాపారులు. గతంలో ఒక ఎకరా భూమి కొనుగోలు చేసే వారు ఆ లావాదేవీలో కేలం 40 శాతం మొత్తాన్ని మాత్రమే వైట్ అవౌంట్‌గా చూపించి, మిగిలిన మొత్తాన్ని బ్లాక్‌లో ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా బ్లాక్ అవౌంట్‌ను తీసుకోడానికి సిద్ధంగా లేరు. వైట్ అవౌంట్ ఇవ్వడానికి కొనుగోలుదారులు ముందుకు రారు. దీంతో ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేసి, వాటిని తిరిగి విక్రయించాలనుకునేవారు ఇప్పుట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవలసిందేనని అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఒడిశా నుంచి అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు విశాఖలో భూములు కొనుగోలు చేశారు. వీటిని తిరిగి విక్రయించే పరిస్థితి ఇప్పట్లో లేదని వారు చెపుతున్నారు. ఇదిలా ఉండగా విశాఖ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన విశాఖ నగరంలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం గణనీయంగా పెరిగిపోయింది. పలు కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్‌లు నిర్మించాయి. ఇప్పటికిప్పుడు గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఆరు నుంచి ఏడు వేల ఫ్లాట్‌లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని క్రేడాయ్ ఏపి అధ్యక్షుడు సుబ్బరాజు ‘ఆంధ్రభూమి’కి తెలియచేశారు. నిర్ణయించిన ధరను తగ్గించి ఫ్లాట్ విక్రయించడానికి బిల్డర్లు సిద్ధపడకపోవచ్చు. కానీ ఈ ఆర్థిక ఒడిదుడుకులు ఆరు నుంచి ఏడాది కాలం కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లక్షలాది రూపాయలను వడ్డీకి తెచ్చి అపార్ట్‌మెంట్ నిర్మించే, అమ్మకానికి వాటిని సిద్ధంగా ఉంచిన బిల్డర్లు అంత కాలం ఆగే పరిస్థితి ఉండకపోవచ్చని సుబ్బరాజు చెప్పారు. ఇక విశాఖలో ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుంది. నిర్మాణ వ్యయం భారీగా పెరిగినప్పటికీ నిర్మాణాలు భారీగా కొనసాగుతున్నాయి.