రాష్ట్రీయం

విపత్తులను ముందే పసిగట్టే సత్తా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: ప్రకృతి విపత్తులను ముందుగానే కనిపెట్టే సామర్ధ్యం భారత దేశానికి ఉందని ఎన్‌జిఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ వీరేందర్ ఎం.తివారి తెలిపారు. న్యూఢిల్లీలో 7వ తేదీన ప్రారంభమైన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌లో భాగంగా శనివారం ఎన్‌జిఆర్‌ఐలో అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ సైంటిస్టు డాక్టర్ ఎన్.పూర్ణచంద్రరావు, పిఐబి అదనపు డిజి పి జె సుధాకర్‌లతో కలిసి వీరేందర్ మాట్లాడుతూ, భూగర్భ జలాల వివరాలతో పాటు భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి విపత్తులను గురించి ముందుగానే పసిగట్టడంలో ఎన్‌జిఆర్‌ఐ ప్రశంసాత్మకమైన కృషి చేస్తోందన్నారు. ప్రజల కోసం విజ్ఞాన శాస్త్రం అనే అంశంపై విజ్ఞాన భారతి ఎనలేని సేవలందిస్తోందన్నారు. వివిధ విజ్ఞాన, సాంకేతిక విన్యాసాలను అర్ధం చేసుకోవడం, వైజ్ఞానిక అవగాహన స్ఫూర్తిని రగిలించడమే ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఉద్ధేశ్యమని ఆయన తెలిపారు.