ఆంధ్రప్రదేశ్‌

టిడిపి ‘స్థానిక’ వ్యూహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 16: రాయలసీమలో వైసీపీని ఆదరిస్తున్న రెడ్డి వర్గాన్ని ఆకట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ తన వ్యూహం మార్చుకుంది. అందులో భాగంగా త్వరలో టీచర్, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల ద్వారా శాసనమండలికి జరిగే ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులనే ఎంపిక చేసింది. అదే సమయంలో అటు బీసీలకూ పట్టం కట్టడం ద్వారా కులసమీకరణ విషయంలో తనదైన శైలి ఎంపికకు తెరలేపింది.
ఉపాధ్యాయ, పట్ట్భద్రుల, స్థానిక సంస్థల ద్వారా త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షనేత జగన్‌ను ఆదరిస్తోన్న రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎన్నికల్లో కోస్తాలో దెబ్బతిన్న వైసీపీ రాయలసీమపై మాత్రం పట్టు సాధించింది. ఇప్పటికీ జగన్ పార్టీకి సీమలో ఇంకా పట్టు ఉందన్న భావన ఉంది. అయితే, వైసీపీని ఆదరిస్తున్న రెడ్డి సామాజికవర్గాన్ని ఆ పార్టీ నుంచి దూరం చేసేందుకు తెదేపా కూడా అదే వర్గాన్ని మెప్పించే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రెడ్డి వర్గానికి సీమ జిల్లా అభ్యర్ధిత్వాలు ప్రకటించింది.
నెల్లూరు-ప్రకాశం-చిత్తూరు పట్ట్భద్రుల నియోజకవర్గం నుంచి మంత్రి నారాయణ సన్నిహితుడైన వేమారెడ్డి పట్ట్భారామిరెడ్డిని, అనంతపురం-కడప-కర్నూలు పట్ట్భద్రుల నియోజకవర్గానికి జె.కె.రెడ్డిని, కడప జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గానికి పులివెందులకు చెందిన రవీంద్రరెడ్డి (బిటెక్ రవి)ని ఎంపిక చేసింది. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నుంచే మరోసారి రెడ్డి వర్గ అభ్యర్థిని ప్రకటించడం బట్టి, పార్టీ నాయకత్వం కులసమీకరణలకు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చిందో స్పష్టమవుతుంది. కడప జిల్లాలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సారథ్యంలో స్థానిక సంస్థల సభ్యులతో పార్టీ అభ్యర్ధికి ఓటు వేయించేందుకు రంగం సిద్ధమయింది. ఒకరకంగా కడప స్థానిక సంస్థల విజయం సీఎం రమేష్‌కు కత్తిమీద సాము. నిజానికి కడప జిల్లా స్థానిక సంస్థల్లో ఇప్పటికీ సంఖ్యాపరంగా వైసీపీకే బలం ఉంది. పైగా వైసీపీ నుంచి వైఎస్ సోదరుడైన వైఎస్ వివేకానందరెడ్డి అభ్యర్ధిగా బరిలో దిగనున్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్ధి బిటెక్ రవిని శాసనమండలి వైస్ చైర్మన్ సతీష్‌రెడ్డి ఎంతవరకూ సమర్థిస్తారో చూడాలి.
కాగా, సీమలో రెడ్డి సామాజికవర్గానికి పట్టం కట్టడం ద్వారా ఆ వర్గాన్ని మెప్పించిన తెదేపా, కడపలో బీసీలలో బలమైన గాండ్ల కులానికి అవకాశం ఇవ్వడం ద్వారా అటు స్థానిక సంస్థలు, ఇటు టీచర్ నియోజకవర్గ ఎన్నికల్లో సామాజిక సమతుల్యం పాటించినట్లు కనిపిస్తోంది. అనంతపురం-కడప-కర్నూలులో గాండ్ల వర్గానికి చెందిన బచ్చల పుల్లయ్య (మైదుకూరు)ను ఎంపిక చేసింది. దీని ద్వారా ఎంబీసీ వర్గానికి తాము ప్రాధాన్యం ఇస్తామన్న సంకేతం పంపడంలో తెదేపా నాయకత్వం విజయం సాధించింది.