ఆంధ్రప్రదేశ్‌

ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌పై ఐటి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 23: అనంతపురం నగరంలోని ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కార్యాలయంపై బుధవారం ఆదాయ పన్నుశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బెంగళూరు నుంచి వచ్చిన ఐటి అధికారుల బృందం బుధవారం ఉదయం అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కార్యాయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కంపెనీ యజమాని అమిలినేని సురేంద్రబాబు కార్యాలయంలో లేరు. మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేష్ సైతం అందుబాటులో లేరు. మైనింగ్ మాఫియాతో ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం.
బెంగళూరులో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయంలో సైతం సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. బళ్ళారికి చెందిన మైనింగ్ డాన్ గాలి జనార్ధన్‌రెడ్డి ఇటీవల రూ.550 కోట్లు ఖర్చుపెట్టి తన కూతురు బ్రాహ్మణి వివాహం జరిపించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గాలితో ఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమాని సురేంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వీరిద్దరి మధ్య కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకే ఐటి శాఖ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లో పలు నిర్మాణం పనులు జరుపుతోంది. ఈ పనుల్లో ఆర్జించిన మొత్తాలకు ఆదాయ పన్ను ఎగవేయటంతో పాటు, ఆయా పనుల్లో అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో గాలి జనార్ధన్‌రెడ్డి మైనింగ్‌లో పెట్టుబడులు పెట్టినట్టు ఫిర్యాదు రావడంతో ఐటి అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో హంద్రీనీవా సుజల స్రవంతికి సంబంధించి కాలువల నిర్మాణం పనులను ఎస్ ఆర్ కన్‌స్ట్రక్షన్ చేపట్టింది. రామగిరి ప్రాంతంలో 5,7 ప్యాకేజీలు, పుట్టపర్తిలో 8వ ప్యాకేజీ, కదిరి ప్రాంతంలో 25వ ప్యాకేజీ, పెనుకొండలో 53వ ప్యాకేజీ పనులు చేపట్టింది. ఇందులోని వచ్చే బిల్లులకు కూడా సరైన రికార్డులు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సోదాలు నిర్వహించిన ఐటి అధికారులు ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన పలు రికార్డులు, బ్యాంకు పాస్ బుక్కులు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అనంతపురం నగరంలోని ఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కార్యాలయం వద్ద ఆగిఉన్న కర్నాటకకు చెందిన ఐటి అధికారుల వాహనం