రాష్ట్రీయం

బాలికావిద్యపై కొత్త విధానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: జాతీయ స్థాయిలో బాలికా విద్య ప్రోత్సాహానికి కేబ్ నియమించిన సబ్ కమిటీ చైర్మన్ హోదాలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేంద్రప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి చేసిన సిఫార్సులకు కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రధానంగా కెజిబివిల్లో విద్య బోధనకు సహాయం చేయాలని కేంద్రానికి సూచించారు. ప్రస్తుతం కేంద్రం కెజిబివిలకు 6వ తరగతి నుండి 8వ తరగతి వరకూ మాత్రమే సాయం అందిస్తోంది. దానిని 12వ తరగతి వరకూ పొడిగించడం వల్ల బాలికా విద్యకు ప్రోత్సాహాన్ని అందించినట్టవుతుందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. అలాగే తెలంగాణ పథకాల అమలు గురించి కూడా ఆయన కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో చర్చించారు. సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకాల కింద తెలంగాణ రాష్ట్రానికి రావల్సిన 500 కోట్ల రూపాయలు వీలైనంత త్వరగా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 21 జిల్లాల్లో నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పాటైన 110 వెనుకబడిన మండలాల్లో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అలాగే 21 కొత్త జిల్లాల్లో 21 డైట్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. కెజిబివిలకు కేంద్రం ప్రస్తుతం 8వ తరగతి వరకే వ్యయాన్ని భరిస్తోందని, దానిని 12వ తరగతి వరకూ కొనసాగించేలా చూడాలని కూడా పేర్కొంది. బాలికా విద్య ప్రోత్సాహానికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. వీలైనంత తొందర్లో సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఎ) నిధులను విడుదల చేస్తామని పేర్కొంది.