ఆంధ్రప్రదేశ్‌

30 శాతం తగ్గిన ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 21: పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రానికి 30 శాతం మేర ఆదాయం తగ్గిందని రాష్ట్ర ఆర్ఢిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విజయవాడలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు తక్కువగా ఉన్నాయన్నారు. పర్యాటక రంగంలో వృద్ధి నమోదైందన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 15.28 శాతం వృద్ధి సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నామన్నారు. దేశంలో వృద్ధి రేటులో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. ఫిషరీస్, వ్యవసాయం, హార్టికల్చర్ రంగాలకు నిధులు తక్కువగా కేటాయించినా, ఎక్కువ వృద్ధి నమోదు కావడం గమనార్హమన్నారు. ఖరీఫ్‌లో విస్తీర్ణం తగ్గినప్పటికీ, దిగుబడులు పెరిగాయని గుర్తు చేశారు. ప్రాథమిక రంగంలో 24 శాతం వృద్ధి, వ్యవసాయంలో 18 శాతం, ఫుడ్‌లో 29.4 శాతం వృద్ధి నమోదైందన్నారు. వర్షపాతం తగ్గినప్పటికీ, వృద్ధి రేటు పెరగడం మంచి స్ఫూర్తిని ఇస్తున్నదన్నారు. ప్రాథమిక రంగంలో నమోదైన వృద్ధిని ఇలాగే నిలుపుకోవాలన్నారు. సేవారంగంలో, పర్యాటక రంగంలో మరిన్ని ఫలితాలను రాబట్టాల్సి ఉందన్నారు. ఎపీలో పట్టణీకరణ జరిగితే మరింత ఎక్కువగా వృద్ధి రేటు పెరుగుతుందన్నారు. పెద్ద నోట్ల రద్దు కాలం సంక్షోభ సమయమన్నారు. 30 శాతం మేరకు ఆదాయం తగ్గిందని, ఆర్థిక కార్యకలాపాలు తగ్గకుండా ఆదాయం రాబట్టే మార్గాలు చూడాలన్నారు. రాబోయే 10 సంవత్సరాల్లో 12 నుంచి 15 శాతం వృద్ధి రేటు నమోదు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. వృద్ధి రేటు సాధించడం అందరి బాధ్యత అని, అనుకుంటే సాధించగలమన్నారు. ఆర్థిక కార్యకలాపాలు, వృద్ది రేటు తగ్గకుండా చూడాలన్నారు. నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం వివరించారు. ఎటిఎంలను పూర్తి స్థాయిలో కాలిబ్రేషన్ చేయడం, జన్‌ధన్ ఖాతాలను తెరవడం, బ్యాంకింగ్ కరెస్పాండెట్ల ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్.పి.టక్కర్ మాట్లాడుతూ సంస్థాగతంగా తీసుకున్న మార్పులు ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ఆర్థిక నగరాల ప్రతిపాదన అభివృద్ధికి మేలు చేస్తుందన్నారు. 500 ఎకరాల్లో 10 చోట్ల వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. బంగ్లాదేశ్‌లో సర్వీస్ ఇండికేటర్ దేశంలో కన్నా మెరుగ్గా ఉందన్నారు.

సరిహద్దు గ్రామాల్లో
తిష్టవేసిన ఏనుగుల గుంపు

శాంతీపురం, డిసెంబర్ 21: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో ఏడు ఏనుగుల గుంపు తిష్టవేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం కర్ణాటక సరిహద్దు గ్రామమైన పెద్దగాండ్లపల్లి చెరువులోని కర్పూరం తోటలో బుధవారం ఏనుగుల గుంపు ప్రత్యక్షమైంది. కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుంచి వందలాది మంది ఏనుగులను చూడ్డానికి ఎగబడ్డారు. జనాలను చూసి పలుమార్లు ఏనుగులు తిరగబడటంతో ప్రాణభయంతో పరుగులు తీసి పలువురు గాయాలపాలయ్యారు. కొలాలతిమ్మనపల్లి, శెట్టేపల్లి, అనికెర, నల్లపరెడ్డిపల్లి గ్రామాల మీదుగా ఏనుగులు ప్రయాణించి పలుచోట్ల మొక్కజొన్న తోటలను ధ్వంసం చేశాయి. కాగా ఏనుగుల గుంపును తరమడానికి ఆంధ్ర, కర్ణాటక అటవీశాఖ అధికారుల మధ్య విభేదాలు ఏర్పడటంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏనుగుల గుంపు మీదంటే మీదంటూ మీ ప్రాంతంలోకే వెళ్లాలని ఇరు రాష్ట్రాల అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. ఆంధ్రరాష్ట్రం గుడుపల్లె అటవీ ప్రాంతం నుంచి వచ్చాయి కాబట్టి రామకుప్పం అడవి వైపు మళ్లించాలని కర్ణాటక అధికారులు ప్రయత్నించారు. ఇటువైపు వస్తే రైతులు పండించిన పంటలు, గ్రామాలు అధికంగా ఉన్నాయి, తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని, అటు కర్ణాటకలోకి వెళ్లాలని ఆంధ్ర అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇరురాష్ట్రాల అధికారుల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. పలువురు స్థానికులు, ప్రజలు కలుగచేసుకొని ఎవరు తరమవద్దు, అవి ఎటువైపు వెళ్తే అటువైపు మళ్లించాలని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. అయితే ఇరురాష్ట్రాల పోలీసులు, అటవీశాఖ అధికారులు భారీ సంఖ్యలో సరిహద్దు గ్రామాల్లో పహారా కాస్తూ పోటీపడి బాణాసంచా కాలుస్తుండటంతో ఏనుగుల ఘీంకారాలు మిన్నంటారు.