ఆంధ్రప్రదేశ్‌

సముద్ర సంపదపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 21: ఇకపై సముద్ర సంపదపై దృష్టి సారించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. సముద్ర సంపదను ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపై డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడలో రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సు ప్రారంభంలో మాట్లాడుతూ గతంలో హైదరాబాద్‌లో ఐటి ఆధారిక అభివృద్ధిపై దృష్టి సారించామని, ఇప్పడు సముద్ర ఆధారిక అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. ఇందులో భాగంగా సముద్రంలో ఉన్న సంపదను వెలికి తీసేందుకు డిసిఐ నివేదిక అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. అంతర్వేది వద్ద ఈ సంస్థ తను పనులను ప్రారంభించనుందన్నారు. దేశంలో విద్యుత్ గ్రిడ్ ఏర్పాటుచేయడంపై దృష్టి సారించాలని, దానివల్ల భవిష్యత్తులో నీటి సమస్య ఉండదన్నారు. జనవరి 2 నుంచి ప్రారంభమయ్యే జన్మభూమికి సంబంధించి ఇప్పటి నుంచే ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మురుగు కాలువల సమస్య ఎక్కువగా ఉందని, చాలా మంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారన్నారు. విద్యుత్, రెవెన్యూ శాఖలపై కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. గృహ నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి 80 శాతానికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కలెక్టర్లు పని చేయాలన్నారు. తలసరి ఆదాయం, జిడిపికి సంబంధించి కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకని ఆరు జిల్లాలపై ఇకపై దృష్టి పెట్టనున్నానన్నారు. ఈ ఆరు జిల్లాలను కూడా ఇతర జిల్లాలతో సమానంగా తీసుకువచ్చేందుకు తరచూ సమీక్ష చేస్తానన్నారు. వచ్చే వేసవిలో ఏ ఒక్క గ్రామం నీటి సమస్యతో ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖలో ఇళ్ళ పట్టాల పంపిణీ జరిగిన విధానాన్ని ఇకపై అన్ని జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు, పథకాల అమలులో ఆదర్శంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా అవినీతి జరుగకుండా పట్టాల పంపిణీ జరగడంతో 98 శాతం మేర సంతృప్తి వ్యక్తం అయిందన్నారు.
ఫ్లెక్సీల రద్దుపై చట్టం
వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్స్‌ను నియంత్రించేందుకు త్వరలో చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. అధికారుల్లా కాకుండా తమకు ఐదు సంవత్సరాలకు ఒకసారి పరీక్షలు ఉంటాయని, ఈ పరీక్షల్లోపాస్ కాకపోతే తమ ప్రయత్నం, కృషి అంతా ధియరీ గా మిగిలిపోతుందన్నారు. 15 ఏళ్ల పాటు ఈ వృద్ధి ఇలానే కొనసాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విభజల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యాయరని,, త్వరితగతిన సొంత గడ్డకు తీసుకురావాలన్న ప్రయత్నానికి అధికారులు సహకరించారన్నారు. కుటుంబ వికాసానికి 15 , సమాజ వికాసానికి 10 సూత్రాలతో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కష్ట పడి పని చేస్తున్నా, కొంతమంది నేతలు, రాజకీయ పార్టీలు చిట్టచివర్లో వారు పంచే నోట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఇది బాధాకరమని, అందుకే తాను తొలి సంతకం పెద్ద నోట్ల రద్దుచేయాలన్న లేఖపై చేశానన్నారు. నగదు రహిత కార్యకలాపాలకు సంబంధించి ఈ నెల 28న ముఖ్యమంత్రుల కమిటీ సమావేశం కానుందన్నారు.

అనుకుంటే..
ఏదైనా సాధించవచ్చు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 21: అనుకుంటే ఏదైన సాధించవచ్చని, ఇందుకు తన పాదయాత్రే ఉదహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన అనుభవాలన కలెక్టర్లకు వివరించారు. తాను 2800 కిలోమీటర్ల మేరకు 208 రోజలు పాదయాత్ర చేశానన్నారు. ఒక రోజు నడిచిన తరువాత కాలు నొప్పి ప్రారంభమైందన్నారు. వైద్యులు పాదయాత్ర మానుకోవాలని సలహా ఇచ్చారన్నారు. కానీ అది తప్ప ఇంకేదైనా ప్రత్యామ్నాయం చెప్పాలని కోరానన్నారు. మట్టి నేలపై నడవాలని సూచించారన్నారు. తాను మట్టి రోడ్లపై నడిచానన్నారు. అప్పడు తనకు బహిరంగ మల విసర్జన సమస్య తీవ్రత అర్ధమైందన్నారు. పట్టుదలతో, దృఢ సంకల్పంతో తాను విశాఖలో తన పాదయాత్ర ముగించానన్నారు.

‘అగ్రి’ ఆస్తులు కొనుక్కోవచ్చు

నిర్భయంగా బిడ్‌లు దాఖలు చేయవచ్చు శ సిఐడి అదనపు డిజి ద్వారకా తిరుమలరావు

కంచికచర్ల, డిసెంబర్ 21: అగ్రి గోల్డ్ ఆస్తుల వేలంలో టెండరు దాఖలు చేసుకునే వారు ఎలాంటి బెదిరింపులు, రాజకీయ ఒత్తిడులకు గురి కావాల్సిన అవసరం లేదని ఎపి సిఐడి అదనపు డిజి ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. కంచికచర్ల మండలం కీసర గ్రామ పరిధిలో గల అగ్రి గోల్డ్‌కు చెందిన భూములను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో అగ్రీగోల్డ్ సంస్థ రూ.4వేల కోట్లు ప్రజల నుండి డిపాజిట్లు సేకరించిందని, గడువు తీరినప్పటికీ డిపాజిట్ దారులకు తిరిగి సొమ్ము చెల్లించకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారని అన్నారు. అగ్రి గోల్డ్ ఆస్తులు అన్నీ హైకోర్టు ఆధీనంలో ఉన్నాయన్నారు. ఈ నెల 27నాటికి అగ్రిగోల్డ్ ఆస్తులు వేలంలో అమ్మి బాధితులకు సొమ్ము చెల్లించాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. అందులో భాగంగా కీసర పరిధిలో గల అగ్రిగోల్డ్ ఆస్తులు, విజయవాడలో గల అగ్రి గోల్డ్ భవనాలను ఈ నెల 27న వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నెల 26 నాటికి వేలంలో పాల్గొనేవారు బిడ్‌లు దాఖలు చేసుకోవాలన్నారు. 27న హైకోర్టు సమక్షంలో సీల్డ్ కవర్‌ల బిడ్‌లు ఓపెన్ చేసి వేలం వేస్తామన్నారు. అధికంగా బిడ్ దాఖలు చేసినవారికి ఆస్తులు అప్పగించడం జరుగుతుందన్నారు. వేలం ద్వారా వచ్చిన సొమ్మును ఆంధ్రప్రదేశ్ పరిధిలో అగ్రిగోల్డ్ సంస్థలో లక్షలోపు డిపాజిట్ చేసినవారికి చెల్లిస్తామన్నారు. అగ్రిగోల్డ్ వేలంలో పాల్గొనేందుకు రాజకీయ వత్తిడిలు ఉంటాయేమోనని అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. అలాంటి వాటికి తావులేకుండా నిర్బయంగా ఎవరైనా వేలంలో పాల్గొని బిడ్‌లు దాఖలు చేసుకోవచ్చని అన్నారు. ఎవరి బెదిరింపులు, రాజకీయ ఒత్తిడులకు లొంగాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐడి ఐజి అమిత్ గార్గ్, ఎఎస్‌పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.