రాష్ట్రీయం

ఏపి కార్మిక శాఖ అధికారి ఇంట్లో ఏసిబి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం)/ఎల్‌బినగర్, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖాధికారులకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించి కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన అధికారిని ఏపి ఏసిబి సెంట్రల్ ఇన్విస్టిగేషన్ టీము అరెస్టు చేసింది. పెద్ద ఎత్తున ఆరోపణలు, ఫిర్యాదుల వెల్లువ నేపధ్యంలో ఏపి ఏసిబి డిజి ఆర్‌పి ఠాకూర్ ఆదేశాలతో కేసు నమోదు చేసిన అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్మిక, ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ గోపురం ముని వెంకట నారాయణ (54)కు చెందిన ఆస్తులపై శనివారం దాడులు నిర్వహించారు.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం 10చోట్ల ఏకకాలంలో బృందాలు నిర్వహించిన సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు ఆరుకోట్లకు పైగా అక్రమాస్తులు కనుగొన్నారు. వీటితో వివిధ బ్యాంకుల్లో లాకర్లను తనిఖీ చేశారు.
అక్రమాస్తుల జాబితా
ఈ తనిఖీల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఏడు చోట్ల అక్రమాస్తులను గుర్తించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నాలుగు చోట్ల 16 లక్షలు విలువ చేసే ఖాళీ స్థలాలు, హైదరాబాద్‌లో మూడు చోట్ల 46.50 లక్షల విలువైన స్ధలాలు, కడపజిల్లా రాజంపేట, చిత్తూరు జిల్లా తిరుపతిలో 11 లక్షల విలువైన వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో కోటి 16 లక్షల విలువైన ఆరు ఇళ్ల స్థలాలు, మణికొండలో 38 లక్షలు విలువ చేసే ఇంటి స్ధలం, ఎల్‌బినగర్‌లోనే పదిలక్షలు విలువ చేసే నాలుగు షాపులు, మూడు లక్షలు విలువ చేసే ఒక టాటా ఇండికా కారు, 75 వేల రూపాయలు విలువ చేసే మోటారు సైకిల్, 30 వేలు విలువ చేసే స్కూటీ గుర్తించి సీజ్ చేశారు. అదేవిధంగా ఏఓ ఇంట్లో 26 లక్షల 5వేల 80 రూపాయలు నగదు, 650 గ్రాముల బంగారం, 3.4 కేజీల వెండితోపాటు రెండు బ్యాంకు లాకర్ల నుంచి 246 గ్రాముల బంగారం, మరో బ్యాంకు లాకర్ నుంచి 573 గ్రాముల బంగారంతోపాటు, 25 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, 8,87,700 లక్షలు విలువైన ఇంట్లో ఖరీదైన సామాగ్రి, రెండు కోట్ల 65లక్షల విలువైన 105 వ్యాపార సంబంధ ప్రామిసరీ నోట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆదివారం కోర్టులో హాజరుపరుస్తామని డిఎస్పీ వెల్లడించారు.