రాష్ట్రీయం

తలసరి వైద్య ఖర్చు రూ.734

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: తెలుగు రాష్ట్రాల్లో తలసరి వైద్య ఖర్చు రూ.734 ఉంది. గోవా, కేరళతో పోలిస్తే తలసరి వైద్యానికి ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు చేసే వ్యయం తక్కువే. వైద్యానికి, కుటుంబ సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చి వౌలిక సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం నివేదికలో వెల్లడించింది. ప్రత్యేక హోదాయేతర రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఆరో స్థానం ఉన్నట్లు ఆ నివేదిక స్పష్ట చేసింది. తలసరి వైద్య ఖర్చులో గోవా రూ.3,077, కేరళ రూ.1,057, తమిళనాడు రూ.839, గుజరాత్ రూ.834, పంజాబ్ రూ.738, ఎపి, తెలంగాణ రూ.734 కలిగి ఉండగా, కర్ణాటక రూ.731, హర్యాన రూ.722, రాజస్థాన్ రూ.669, మహారాష్ట్ర రూ.633గా ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందించే నిధుల కేటాయింపు 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినా, వైద్యంపై తలసరి వ్యయం మాత్రం చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించామని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆయా హెల్త్ సొసైటీలకు నిధుల మళ్లింపులో కూడా తీవ్ర జాప్యం జరుగుతోందని గుర్తించింది. ఆరోగ్యం రాష్ట్రాలకు సంబంధించిన అంశమైనప్పటికీ నేషనల్ హెల్త్ మిషన్ ఆమోదించిన ప్రణాళికలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉంటుంది. జిల్లాల్లో ప్రధాన ఆసుపత్రుల బలోపేతం, ఉచితంగా డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, ఆరోగ్య ఉపకేంద్రాలను సమర్థంగా నిర్వహించాలని రాష్ట్రాలకు కమిటీ సూచించింది.