ఆంధ్రప్రదేశ్‌

తహసీల్దారు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకోవటమే కా కుండా, ఇదేమని ప్రశ్నించిన తహసీల్దార్‌పై ఒక ఎఎస్‌ఐ కుటుంబం దుర్భాషలకు దిగటంతో,ఆయన ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో సోమవారం జరిగింది. జిల్లాలోని సోమందేపల్లి మండలంలోని ధనలక్ష్మి కాలనీలో గ్రామ పంచాయితీ నిధులతో సిమెంటు రోడ్డు మంజూరయింది. రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించిన కాంట్రాక్టర్ రోడ్డు స్థలాన్ని కొంతమేర ఎఎస్‌ఐ గోపీ నాయక్ కుటుంబం ఆక్రమించినట్టు గుర్తించి, మండల తహశీల్దార్ తిమ్మప్పకు సమాచారం ఇచ్చాడు. దీంతో తహసీల్దారు ఆదేశాల మేరకు విఆర్‌ఓ, సర్వేయర్ అక్కడ సర్వే నిర్వహించి, రోడ్డు స్థలం ఆక్రమించుకున్న విషయం వాస్తవమేనని తేల్చారు. దీంతో తహసీల్దారు ఈ విషయాన్ని సంబంధిత (ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రామీణాభివృద్ది శాఖ) ఈవోఆర్‌డికి తెలియచేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఎఎస్‌ఐ గోపీ నాయక్ కుటుంబ సభ్యులు తహసీల్దారు తిమ్మప్ప ఛాంబర్ వద్దకు వచ్చి అతనిని తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు.
ఒక దశలో వారందరూ కలసి అతనిపై దాడికి సైతం యత్నించినట్టు తహసీల్దారు కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తహసీల్దారు తిమ్మప్ప మధ్యాహ్నం తన ఛాంబర్ లోనే బెల్టుతో ఫ్యానుకు ఉరి వేసుకోవడానికి యత్నించాడు. గమనించిన సిబ్బంది ఛాంబర్ తలుపులు బద్దలు కొట్టి తహశీల్దార్‌ను రక్షించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ట్రైనీ కలెక్టరు సుమిత్‌కుమార్ గాంధీ, పెనుకొండ ఆర్‌డిఓ రామ్మూర్తి తహశీల్దారును పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే దీనిపై ఇప్పటివరకూ తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పెనుకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టరు వెంకటేశ్వర్లు పేర్కొనడం గమనార్హం.