ఆంధ్రప్రదేశ్‌

బడుగుల సం‘క్షేమం’ చూసిన బాబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 15: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తన పార్టీకి పునాదిరాళ్లయిన బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ప్రధానంగా బిసి బడ్జెట్‌ను గత ఏడాది కంటే ఈసారి రూ. 5,013 కోట్లు పెంచారు. మొత్తంగా గత ఏడాది కంటే ఈ సారి సంక్షేమానికి 84 శాతం నిధులు పెంచి ఆయా వర్గాల పెదవులపై బాబు చిరునవ్వులు పూయించారు.
వెనుకబడిన తరగతుల సంక్షేమానికి...
కొత్త ఫైనాన్స్ కార్పొరేషన్‌కు తొలి విడతగా రూ.60 కోట్లు, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, ఉపకార వేతనాలకు రూ.1,316 కోట్లు, వసతి గృహాల నిర్వహణకు రూ.307 కోట్లు, స్టడీ సర్కిళ్లకు రూ.30 కోట్లు, 32 బిసి గురుకుల పాఠశాలల సంఖ్యను 41కి పెంచుతూ కొత్త పాఠశాలలను మంజూరు చేసింది.
గిరిజన సంక్షేమానికి...
గిరిజన సంక్షేమ శాఖకు రూ.1,814 కోట్లు కేటాయించారు. ఇందులో విద్యా కార్యక్రమాలకోసం రూ.1,157 కోట్లు, జీవనోపాధుల కోసం రూ.253 కోట్లు, షెడ్యూలు తెగల ఉప ప్రణాళిక కింద రూ.3,099 కోట్ల నుంచి రూ.3,528 కోట్లకు పెంచింది.
* బిసి కార్పొరేషన్‌కు రూ.615 కోట్లు
* వెనుకబడిన తరగతులకు చెందిన మిగిలిన సంక్షేమ కార్పొరేషన్‌లకు రూ.295 కోట్లు
* ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకానికి రూ.79 కోట్లు
* వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను రూ.4,430 కోట్ల నుంచి రూ.5,013 కోట్లకు పెంచింది
* ఆర్థికంగా వెనుకబడ్డ ఇతర తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తొలిసారి ప్రత్యేక కేటాయింపులు చేసింది. ఆర్థికాభివృద్ధి పథకాలకు రూ.236 కోట్లు, ఉపకార వేతనాలకు రూ.432.75 కోట్లు, సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ కలిపి రూ.695 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌కు రూ.75 కోట్లు, కాపు కార్పొరేషన్ కోసం వెయ్యి కోట్లు కేటాయించింది.
* విదేశీ విద్యకోసం అందించే స్కాలర్‌షిప్ క్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.5 కోట్లు.
* అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.840 కోట్లు, వారి విద్యా కార్యక్రమాలకు రూ.260 కోట్లు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల భవన నిర్మాణానికి రూ.100 కోట్లు.
* అల్ప సంఖ్యాక వర్గాల్లో అర్హులైన వారి స్కాలర్‌షిప్‌లకు రూ.240 కోట్లు
* ఎపి క్రైస్తవ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.35 కోట్లు కేటాయించింది.
* ఉర్దూఘర్, షాదీఖానాలకు రూ.15 కోట్లు
* వక్ఫ్ సర్వే కమిషన్ కోసం రూ.50 కోట్లు
* అల్ప సంఖ్యా వర్గాలకు చెందిన నిరుపేదల కుటుంబాల యువతుల వివాహ ఖర్చులకు అమలు చేస్తున్న ‘దుల్హన్’ పథకం కింద రూ.60 కోట్లు.
* మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లు, వౌజన్ల ప్రోత్సాహకాలకోసం రూ.24 కోట్లు కేటాయించారు.