ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో ఇన్నోవేటివ్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: సైబర్ సెక్యూరిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించేందుకు మాస్టర్ కార్డ్ సంస్థ ముందుకొచ్చింది. విశాఖలో ఆవిష్కరణల అభివృద్ధి కేంద్రం (ఇన్నోవేటివ్ డెవలప్‌మెంట్ సెంటర్) ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేసింది. బుధవారం రాత్రి విజయవాడ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయిన మాస్టర్ కార్డ్ గ్లోబల్ సిఈవో అజయ్ బోంగా ఎపిలో తమ ప్రణాళికలపై చర్చించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు యూనివర్శిటీ విద్యార్థులకు ఉపకరించే ల్యాబ్ ఏర్పాటుకు అంగీకారం తెలియజేశారు. అమెరికాలో సైబర్ సెక్యూరిటీ సెల్ ఏర్పాటులో ముఖ్య భూమిక వహించిన మాస్టర్ కార్డ్ గ్లోబల్ అక్కడ ఏ తరహా సాంకేతిక పద్ధతులను అమలు చేశారో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అవే విధానాలను పరిచయం చేస్తామని అజయ్ ముఖ్యమంత్రికి చెప్పారు. రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డకు సంబంధించిన వివరాల దగ్గర నుంచి క్రయ విక్రయాలు జరిపే భూముల వివరాల వరకు సమస్తం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని, ఇటువంటి నేపథ్యంలో ఎపికి సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యమైన అంశంగా మారిందని ముఖ్యమంత్రి వివరించారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో భాగంగా ఇ-ప్రగతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని ప్రభుత్వంలోని ప్రతి విభాగాన్ని సంపూర్ణంగా డిజిటలైజ్ చేస్తున్నామని చెప్పారు. విశాఖలో త్వరలో ఎథికల్ హాకర్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని, అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ దేశాలకు చెందిన అనేక మంది నిపుణులు పాల్గొంటారని అజయ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ఒక ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ రూపొందించడానికి సిద్ధంగా వున్నామని ఆయన తెలిపారు. పంట వివరాలు మొదలు పొలానికి అవసరమైన ఎరువులు, పురుగు మందులు, చివరికి ఉత్పత్తులను సైతం మార్కెటింగ్ చేసుకునేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తూ ఈ అప్లికేషన్ రైతు మిత్రునిగా వుంటుందని చెప్పారు.
ఇస్రోతో కలిసి మరింత ముందుకు...
ఇస్రోతో కలిసి పనిచేసే మ్యాపుల ద్వారా ఏపిలో ఎక్కడెక్కడ పవర్ ప్రాజెక్టులు నిర్మించవచ్చో, ప్రాజెక్టులు నిర్మించేందుకు ఉన్న అనుకూల పరిస్థితులేంటన్న విషయాలని పరిశీలిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇస్రోతో ఎంఓయు కుదుర్చుకున్నారు.
అతిపెద్ద లాజెస్టిక్ హబ్‌గా దగదర్తి
దగదర్తి విమానాశ్రయాన్ని దేశంలో అతిపెద్ద లాజెస్టిక్ కార్గో హబ్‌గా తీర్చిదిద్దాలనేదే తన ప్రయత్నమని సిఎం చంద్రబాబు చెప్పారు. ఒప్పందం చేసుకున్న 18 నెలల్లో విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని మలేషియాకు చెందిన ఏవియేషన్ సంస్థ స్కైపార్క్ బిజినెస్ ప్రతినిధులకు స్పష్టం చేశారు. బుధవారం రాత్రి విజయవాడ విమానాశ్రయంలో నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టుపై స్కైపార్క్ ప్రతినిధులతో ఆయన చర్చించారు.
నెల్లూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దగదర్తి విమానాశ్రయానికి రానున్న కాలంలో డిమాండ్ వస్తుందని భావించి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.