రాష్ట్రీయం

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ కుమార్తె ప్రసవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 17: ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా విస్తృత చర్యలు తీసుకోవాలని ఈ మధ్యకాలంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వైద్యాధికారులను ఆదేశించటం షరామామూలు వ్యవహారంగా కొనసాగుతోంది. కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధిగానీ, అధికారులుగానీ తమ కుటుంబ సభ్యుల, తమ పిల్లల ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిపించిన దాఖలాలు లేవు. కానీ మాటలకే కాదు.. చేతలకు కూడా తాను సిద్ధమని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి ఆచరించి చూపారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తన కూతురు డెలివరీ చేయించి చేతల మనిషిగా నిరూపించుకున్నారు. కలెక్టర్ మురళి కూతురు ప్రగతి తన భర్తతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ప్రసవం కోసం 15రోజుల కిందట భూపాలపల్లికి తండ్రి వద్దకు వచ్చారు. ప్రసవం కోసం వైద్యులు పరీక్షలు జరిపిన సదర్భంలో ఆమెకు థైరాయిడ్ ఉందని తేల్చిన వైద్యులు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు ప్రసవం జరిపించాలని సూచించారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎవరైనా ఇటు వరంగల్, లేకుంటే హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. కానీ జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరి మురళి మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికే ప్రాధాన్యత ఇచ్చారు. కూతురు ప్రగతికి శుక్రవారం పురిటినొప్పులు రావటంతో కలెక్టర్ దంపతులు ఆమెను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు పరీక్షలు జరిపిన అనంతరం జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య పర్యవేక్షణలో ఆపరేషన్ జరిపి పండంటి ఆడశిశువుకు ప్రాణం పోశారు. కలెక్టర్ కూతురు, మనువరాలి ఆరోగ్యం బాగా ఉందని వైద్యులు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు తన కూతురు ప్రసవాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిపించానని కలెక్టర్ మురళి తెలిపారు.

చిత్రం..మనవరాలిని ఎత్తుకుని మురిసిపోతున్న
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి దంపతులు