ఆంధ్రప్రదేశ్‌

నాకు కోరికల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 5: ‘‘గత రెండున్నరేళ్లలో ఎక్కడా జరగని అభివృద్ధి..సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేశాం.. నా ప్రయోజనాల కోసం మీ సహకారం అడగటంలేదు.. నాకు ఎలాంటి కోరికలు లేవు. కష్టాల్లో ఉండే రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నా.. మంచికి మద్దతివ్వండి.. మీ జీవితాల్లో వెలుగు చూడాలనేదే నా ఆకాంక్ష’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సమర్థత..సుస్థిరత..నీతివంతమైన పాలనతోనే పేదలకు న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రాంలు అసమానతలను ప్రతిఘటించిన స్ఫూర్తితో నేటితరం కదలాలని పిలుపునిచ్చారు. బాబూ జగ్జీవన్‌రాం 110వ జయంతి వేడుకల సందర్భంగా గుంటూరు చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్స్‌లో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసగించారు. కాంగ్రెస్ పార్టీ నాడు దళితుడు ప్రధానమంత్రి కాకూడదనే దురుద్దేశ్యంతోనే ఆయన్ను దూరం చేసిందన్నారు. తమ ప్రభుత్వం లోక్‌సభలో జిఎంసి బాలయోగి, రాష్ట్ర శాసనసభలో ప్రతిభాభారతి వంటి వారికి స్పీకర్ పదవులు ఇచ్చి దళితుల సమానత్వానికి బాట వేసిందన్నారు. దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తితో కుల, మత, ప్రాంతాల కతీతంగా సమర్థులైన నాయకత్వాన్ని ముందుకు తీసుకు వచ్చామన్నారు. తమ ప్రభుత్వంలో మాల, మాదిగలకు ఎలాంటి అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. ఒకే కుటుంబం మాదిరిగానే అన్ని వర్గాల పట్ల సమన్యాయం పాటిస్తామన్నారు. పేదల అభ్యున్నతికి 15 సూత్రాలతో ప్రభుత్వం అన్నిరకాల భద్రత కల్పిస్తోందని చెప్పారు. ఎస్సీలకు 9,757 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. జీవన భద్రత కింద 47లక్షల మందికి పింఛన్లు, ఆహారభద్రత కింద ఐదు కిలోల బియ్యం, విద్యా భద్రత కింద ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు తగిన ప్రోత్సాహం, విదేశీ విద్యకు ఆర్థిక చేయూత అందిస్తున్నామని వివరించారు. ఏటా 6లక్షల మందికి 700 కోట్లతో స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామని, సంక్షేమ హాస్టళ్లను ఇకపై గురుకుల విద్యాలయాలుగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దళితులకు కార్పొరేట్ విద్యనందించటం ద్వారా ఉన్నత విద్యకు తగిన ప్రోత్సాహమిస్తామని వెల్లడించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్ష లోపు రుణాలకు 60 శాతం సబ్సిడీ అందిస్తామన్నారు. జగ్జీవన్‌రాం పేరిట జగ్జీవన్ జ్యోతి కింద ఎస్సీ, ఎస్టీలకు 75 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించారు. డ్వాక్రా సంఘాలలో ఎస్సీ, ఎస్టీలకు రుణ సదుపాయం కల్పించటం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించారని గుర్తుచేశారు. ఎకరానికి 15 లక్షలు కేటాయించి పేదలకు భూ పంపిణీ, సేద్యానికి భద్రత కల్పించాలనే యోచనతో ప్రభుత్వం ఉందన్నారు. నీటి భద్రత కింద ప్రతి గ్రామానికి మంచినీరు, సాంకేతిక భద్రత కింద ఫైబర్ గ్రిడ్‌ను వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రానికి 10లక్షల ఇళ్లు మంజూరయ్యాయని ప్రస్తుతం నాలుగున్నర లక్షల వరకు నిర్మాణాలు జరుగుతున్నట్లు వివరించారు. పశు పోషణ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఆదాయ మార్గాలు పెంచామన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించాలి.. ఆదాయం పెంచాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలని అభివర్ణించారు. విద్యలో ప్రోత్సాహం అందించి నైపుణ్యత పెంచడం ద్వారా వారి సేవలను వినియోగించుకుంటామన్నారు. సామాన్య, నిరుపేద వర్గాలకు ఇబ్బంది లేకుండా 127సర్ట్ఫికెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందే వీలు కల్పించామన్నారు. ఈ సందర్భంగా 800 కోట్ల విలువైన ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.