ఆంధ్రప్రదేశ్‌

ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ విలువలను కాపాడడంలో గవర్నర్, ముఖ్యమంత్రి, స్పీకర్‌లు విఫలమయ్యారని వైకాపా ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఈ నెల 6న (గురువారం) ఢిల్లీలో రాష్టప్రతి అపాయింట్‌మెంట్ ఖరారైందని, రాష్టప్రతిని కలిసి ఆంధ్రలో ఫిరాయింపుదార్లకు మంత్రిపదవులపై ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో 70 సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్య విధానాలకు, రాజ్యాంగబద్ధమైన సంప్రదాయాలకు చంద్రబాబు పాతరేస్తుంటే గవర్నర్ దగ్గరుండి రాజముద్రలు వేస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహించడం మంచి పరిణామం కాదన్నారు. ఒక రాజకీయ పార్టీ శాసనసభ్యులు మరోపార్టీలో కలిసినప్పుడు తనకు అందిన ఫిర్యాదు మీద స్పీకర్ స్పందించకుండా పక్కనపెట్టడం సరికాదన్నారు. వైకాపా గుర్తుపై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరితే వారిపై చర్యలు తీసుకోవాల్సిన గవర్నర్ దగ్గరుండి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం దుర్మార్గమన్నారు. దేశంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినప్పుడు రాష్టప్రతి జోక్యం చేసుకునే అవకాశం ఉందన్నారు.
256వ అధికరణ కింద రాష్టప్రతికి అపరిమిత అధికారాలు ఉన్నాయన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రాలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంటే, ప్రధాని నరేంద్రమోదీ ఏమి చేస్తున్నారన్నారు. ఇవి సాధారణమైన ఉల్లంఘనలు కావని, రాష్ట్ర ప్రజల అసహ్యించుకునే స్ధితి లోఈ ఉల్లంఘనలు వచ్చాయన్నారు.