ఆంధ్రప్రదేశ్‌

నలుగురు చిన్నారుల సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, ఏప్రిల్ 17: తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చావడికోట పంచాయతీ బందగ్రామం సిరిపెనలోవ కొండపై ఆదివారం సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. వీరిలో ఏడాది వయస్సున్న ఇద్దరు కవలలు కూడా ఉన్నారు. వీరిని రక్షించడానికి ప్రయత్నించిన వారి తాతయ్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతంలోని కొండపై జరిగిన ఈ దుర్ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సిరిపెనలోవ కొండపై బచ్చెల లక్ష్మిరెడ్డి, పద్మ అనే గిరిజన దంపతలు పూరి గుడిసె నిర్మించుకుని నివసిస్తున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ఆదివారం సాయంత్రం చిన్నారుల తండ్రి లక్ష్మిరెడ్డి కొండ చీపుర్ల కోతకు వెళ్ళగా, తల్లి పద్మ మంచినీటి కోసం కొండ చెలమ వద్దకు వెళ్ళింది. చిన్నారుల వద్ద తాతయ్య బచ్బెల పండురెడ్డి ఉన్నాడు. ఈ క్రమంలో కొండపోడు భూముల్లో ఒక్కసారిగా నిప్పు రాజుకుని, మంటలు ఎగసిపడ్డాయి. మంటలు పూరి గుడిసెను చుట్టుముట్టడంతో ఇంట్లో ఉన్న చిన్నారులు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు తాత పండురెడ్డి విఫలయత్నం చేశాడు. రాజేశ్వరి (7), పెదరామిరెడ్డి(4), చినరామిరెడ్డి (1)ని బయటకు తీసుకువచ్చినా అప్పటికే తీవ్ర గాయాల పాలైన ఆ చిన్నారులు కాసేపటికే కన్నుమూశారు. రామలక్ష్మి (1) అనే మరో చిన్నారి ఉయ్యాలలోనే కాలిబూడిదైపోయింది. నలుగురు పిల్లలకు అగ్నికి ఆహుతికావడంతో ఆ తల్లిదండ్రుల ఆక్రందనలకు అంతులేదు. ప్రమాద సమాచారం సోమవారం ఉదయానికి బాహ్య ప్రపంచానికి తెలియవచ్చింది.
chitra...
ప్రమాదంలో మృతిచెందిన చిన్నారులు