ఆంధ్రప్రదేశ్‌

రేషన్ బదులు నగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బదిలీ చేసేందుకు సిద్ధమన్న సిఎం జూన్ నాటికి అందరికీ గ్యాస్ కనెక్షన్లు
తొలి ఒడిఎఫ్ జిల్లాగా పశ్చిమగోదావరి అవినీతిని సహించేది లేదని హెచ్చరిక

తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 29: రాష్ట్రంలో రేషన్‌కు బదులుగా నగదు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రేషన్ దుకాణాల్లో సరుకులు వద్దనుకునే వారికి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా డబ్బులు ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల నూటికి నూరు శాతం అవినీతికి ఆస్కారం ఉండదని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతికి విధి విధానాలు త్వరలోనే ఖరారు చేయనున్నామని చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి బహిరంగ మల విసర్జన రహిత (ఒడిఎఫ్) జిల్లాగా పశ్చిమగోదావరి ఖ్యాతి గడించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే పొగరహిత జిల్లాగా కూడా పశ్చిమ గోదావరి తయారయ్యిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల జిల్లా పరిషత్ హైస్కూలులో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. జిల్లాలోని 48 మండలాలు, 958 గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా నిలవడం అభినందించదగ్గ విషయమన్నారు. 2018 నాటికి జిల్లాలో ఏ గ్రామంలో కూడా చెత్త లేకుండా చూసే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకుంటుందన్నారు.
అలాగే జిల్లాలో 16,50,130 కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు అందించి, జిల్లాను పొగ రహిత జిల్లాగా నిలిపామన్నారు. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ కృషి ప్రశంసనీయమన్నారు. జూన్ నాటికి నూరు శాతం వంట గ్యాస్ కనెక్షన్లు అందించి దేశంలోనే తొలి పొగ రహిత రాష్ట్రంగా నిలిపేందుకు కృషిచేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తనకెంతో ప్రీతికరమైన ప్రాంతమన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు భూసమస్య ఉందన్నారు. కాలుష్య రహిత జిల్లాగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
కాగా రేషన్ దుకాణాల్లో బియ్యం వద్దనుకునేవారికి నగదు బదిలీచ్చే కార్యక్రమాన్ని త్వరలో ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రైతులకు పెట్టుబడి తగ్గి పంటలకు గిట్టుబాటు ధర లభించి, వ్యవసాయం లాభసాటిగా సాగాలనేది తమ లక్ష్యమన్నారు. గత మూడేళ్లుగా జిల్లాలో వివిధ రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పితాని సత్యనారాయణ, కె ఎస్ జవహర్, ఎంపి మురళీమోహన్, తోట సీతారామలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

చిత్రం... ప్రజలతో ముఖాముఖిలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు