ఆంధ్రప్రదేశ్‌

ఆరుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు/మేడికొండూరు, మే 5: గుంటూరు జిల్లా మేడికొండూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పాత గుంటూరుకు చెందిన సుఖమంచి రాఘవేంద్రరావు(55), తాడికొండ మండలం పొనె్నకల్లుకు చెందిన పోసా వెంకట నారాయణ (47), గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన దాసరి కిరణ్ (43), గుంటూరు పరమయ్యకుంటకు చెందిన ముప్పరి శ్రీనివాసరావు (32), గుంటూరు శారదాకాలనీకి చెందిన మదిన రాజారావు (45) కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం నందవరం గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి రెంటచింతలలో ఓ వివాహానికి హాజరై స్కార్పియో వాహనంలో గురువారం అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. మేడికొండూరు- భీమినేనివారిపాలెం గ్రామాల మధ్యన గుంటూరునుంచి మాచర్ల వెళుతున్న లారీ .. స్కార్పియోను ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వెంకట సుబ్బారెడ్డిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మేడికొండూరు సిఐ బాలాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ మద్యం సేవించిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతుల కుటుంబాలకు పరిహారం
మృతదేహాలను గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, మన్నవ సుబ్బారావుతదితరులు సందర్శించారు. మృతుల కుటుంబాలను చంద్రన్న బీమా పథకం కింద ఐదు లక్షల రూపాయల పరిహారం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కార్యకర్తల సంక్షేమ నిధి నుండి మరో రెండు లక్షల రూపాయల ఆర్థికసాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాల్లో ఇళ్లులేని వారికి గృహాలు మంజూరు చేస్తామని తెలిపారు.

చిత్రం... ప్రమాద సంఘటనా స్థలంలో పడివున్న మృతదేహాలు