ఆంధ్రప్రదేశ్‌

టిఆర్‌ఎస్ ప్లీనరీకి విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర సమితి 15వ ప్లీనరీకి ఖమ్మంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 27న జరగనున్న ప్లీనరీకి పార్టీ ప్రధాన నేతలంతా హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు పార్టీ ప్రధాన నేతలంతా 26న సాయంత్రానికే ఖమ్మం చేరుకోనున్నట్లు స్థానిక నాయకులు వెల్లడించారు. ఖమ్మం నగరంలో తొలిసారి జరుగుతున్న ప్లీనరీని విజయవంతం చేసేందుకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు. 8 కమిటీలు ఏర్పాటు చేసి అన్ని పనులను పూర్తి చేశారు. మరోవైపు ఖమ్మం నగరాన్ని అందంగా తీర్చిదిద్దటమే కాకుండా పార్టీ ప్రధాన నేతలందరికీ స్వాగతం పలుకుతూ ప్రధాన రహదారుల వెంట భారీ ప్లెక్సీలు, తోరణాలు ఏర్పాటు చేశారు. 27న ఉదయం 9 గంటలకే పిజి కళాశాల మైదానంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అనంతరం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 10గంటలకు ప్లీనరీకి ఆయన హాజరుకానున్నారు. సాయంత్రం 5గంటల వరకు ప్లీనరీ జరుగుతుంది. మధ్యలో కేవలం గంటసేపు మాత్రం భోజన విరామ సమయంగా ప్రకటించారు. ప్లీనరీలో 15 ప్రధాన అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. సాయంత్రం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రతినిధుల సభ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో 150 టన్నుల కెపాసిటీ కలిగిన ఏసిలు, 60 జంబో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ, ఎవరూ వాడని సాంకేతికతను జైన్ కంపెనీ సహకారంతో ఈ ప్లీనరీలో వినియోగించుకుంటున్నామని పార్టీ నాయకులు తెలిపారు. ఇదిలావుంటే, 26న రాత్రి ప్లీనరీలో చేసే తీర్మానాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఖమ్మం చేరుకోగానే ఈ సమావేశం నిర్వహించనున్నారు. ప్లీనరీ వేదికపై ముఖ్యమంత్రి కెసిఆర్ సహా 24 మంది నేతలు మాత్రమే కూర్చుంటారు. అయితే తీర్మానాలను బలపరిచే అవకాశం కొందరు శాసనసభ్యులకు కూడా కల్పించనున్నారు.
నోరూరించే రుచులు!
ప్లీనరీకి హాజరయ్యే 4వేల మంది ప్రతినిధులకు మధ్యాహ్న భోజనంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వంటకాలు తయారు చేస్తున్నారు. తెలంగాణ వంటకాల్లో ప్రధానమైన అరిసెలు, సకినాలు, పూర్ణాలు, మామిడికాయ పచ్చడి, తదితరాలు అందించనున్నారు. భోజనశాలలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులకు ఒకచోట, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు మరోచోట, ఇతర నేతలకు ఇంకోచోట, పోలీసులు, బందోబస్తు సిబ్బంది, మీడియాకు విడిగా ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేశారు.

చిత్రం టిఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లలో నిమగ్నమైన పార్టీ నాయకులు