రాష్ట్రీయం

జాతీయ స్థాయలో మనవాళ్లే టాపర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు పోటీ పడిన ప్రతిష్టాత్మకమైన జెఇఇ మెయిన్ 2016 ఫలితాలను సిబిఎస్‌ఇ బుధవారం సాయంత్రం విడుదల చేస్తూ మార్కులను ప్రకటించింది. త్వరలో వీరికి ర్యాంకులు ఇవ్వనుంది. పరీక్షలో సాధించిన మార్కుల్లో జాతీయస్థాయిలో సాయితేజ తాళ్లూరి (20438099) 345 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడని సమాచారం. తర్వాత మన రాష్ట్రంలో అత్యధిక మార్కులను విఘ్నేష్‌రెడ్డి కొండా (20439192) 340 మార్కులు సాధించాడు. అత్యధిక మార్కులను తెలుగు విద్యార్థులు పలువురు సాధించారు. 335 మార్కులతో సత్తాచాటిన నలుగురు విద్యార్థుల్లో మాల్పురు ప్రశాంత్‌రెడ్డి (10209045) ఉన్నారు. వివిధ కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీ విద్యార్ధులు ఈసారి మంచి మార్కులే సాధించారు. టాప్ మార్కులు సాధించిన వారిలో సాయి ఆదిత్య సొంటి (20437512), పి సాయి కిరణ్ రెడ్డి, ఎస్ సాయి ప్రణీత్ రెడ్డి, చప్పిడి లక్ష్మీనారాయణ, గోవర్ధన్ పరిమళ ఉన్నారు. ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటిలతో పాటు పలు జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఈనెల 3న ఆఫ్ లైన్‌లో, 9,10 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఐఐటి జెఇఇ మెయిన్ పరీక్ష నిర్వహించారు. ఈ స్కోర్ ఆధారంగానే జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే వారిని ఎంపిక చేస్తారు. అత్యధిక మార్కులు సాధించిన రెండు లక్షల మందిని ఎంపిక చేసి వారిని జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.