మెయన్ ఫీచర్

ఐఎస్‌ఐఎస్‌పై ప్రత్యక్ష యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదుల పుణ్యమా అని ప్రచ్ఛన్న యుద్ధం పోయి ప్రత్యక్ష యుద్ధం మొదలయింది. అంకుల్‌శాం నిజాయితీపరు డే అంటుంది బ్రిటన్, కాదు..అంటుంది రష్యా! మరి ఇందులో ఏది నిజం? అంటే రెండూ నిజాలేనని అనిపిస్తున్నది. అదెలాగో చూద్దాం!
ఈనాడు ప్రపంచంలో అన్నింటికన్నా విలువైన ద్రవ్యం బంగారం కాదు- చమురు నిక్షేపాలే. అవి పుష్కలంగా ముస్లిం దేశాల్లో ఉన్నా యి. అమెరికా చమురు లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేదు. జార్జిబుష్ సద్దాం హుస్సేన్‌ను ఎందుకు చంపాడు? అంటే చమురుకోసమే! హుస్సేన్‌వద్ద మారణాయుధాలు ఉన్నా యి అనేది కేవలం ఒక సాకు మాత్రమే. అదే నిజమైతే లిబియా అధినేత గడ్డాఫీ వద్ద భూగర్భంలో రసాయనిక మారణాయుధాలు ఉన్నా యి కదా!! అమెరికా చమురును టర్కీనుండి కొనుగోలు చేసింది. టర్కీ ఐసిస్ నుండి కొనుగోలు చేసింది. ఐసిస్ బషర్ అల్ అసాద్ నుండి చమురు నిక్షేపాలు స్వాధీనం చేసుకుంది. అంటే సిరియాలోని మూడువంతుల భూభాగం ఇప్పు డు ఉగ్రవాదుల స్వాధీనంలో ఉంది. అబూబకర్, అధ్నానీలు తమ ప్రపంచ వ్యాప్త ఉగ్రవాద కార్యకలాపాలకోసం పెట్రో డాలర్లను ఇంధనంగా ఉపయోగపడుతున్నారు. అమెరికా పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నది అని రష్యా ఆరోపించింది. తన ఆరోపణలు నిరూపించుకునే నిమిత్తం శాటిలైట్ ఛాయాచిత్రాలను కూడా విడుదల చేసింది. ఇది తిరుగులేని సాక్ష్యం. ఈ కారణంచేత రష్యామీద అమెరికాకు కోపం వచ్చింది. రష్యా అసద్‌కు అనుకూలంగా ఉండటానికి కారణం చమురు నిల్వలే! అమెరికా ఇటు ఐసిస్‌ను అటు అసద్‌ను వ్యతిరేకిస్తున్నది. లేదా వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తున్నది. ఇదంతా రాజకీయం. రష్యా మాత్రం మనస్ఫూర్తిగానే యుద్ధం చేస్తున్నది. పదిహేను రోజులలో అమెరికా వాడిన ఆయుధాలకన్నా ఒక్కరోజులో రష్యా వాడిన ఆయుధాల సంఖ్య ఎక్కువ అన్నదే ఇందుకు సాక్ష్యం.
ఒబామా తన మాట నిలబెట్టుకొని సిరియాలోని ఐసిస్ స్థావరాల విధ్వంసం మొదలుపెట్టాడు. ఐతే రష్యన్లు చేయని పని అమెరికా చేసింది. అది అసద్ స్థావరాలపై కూడా బాంబులువేయటం- దియర్- ఎజార్‌లోని జీహాదీల స్థావరాలు ఆయిల్ టాంకర్లు ధ్వంసమైనాయి. అప్పుడు పదహారు మంది సిరియా సైనికులు తీవ్రంగా గాయపడటం- కొందరు మరణించారు. ఐసిస్ దినసరి ఆదాయం లక్షల డాలర్లు ఈ చమురు టాంకర్లనుండి లభిస్తుంది. నెలకు దాదాపు ఎనిమిది కోట్ల డాలర్ల నికరాదాయం ఐసిస్ చేతిలో పడుతున్నది. ఇప్పుడు వారి ఆర్థిక మూలాలపై దాడి మొదలయింది. కాబట్టి ఐసిస్‌కు యుఎస్ మద్దతునిచ్చిందనే ప్రచారం పాక్షిక సత్యమే. తనకు చమురు అవసరం ఉన్నంతవరకే సిరియాలో తన అవకాశవాద రాజకీయాలను అమెరికా నెరపుతుంది. ఇప్పు డు ఉగ్రవాదాన్ని సిరియా అమెరికా గడ్డమీదికే ఎగుమతి చేసింది. దీన్ని ఎదుర్కోవలసిన బాధ్య త ఒబామాకు తప్పనిసరి. మరి సమస్య ఎక్క డ? అంటే ఐసిస్- అసద్‌ల నిర్మూలన తర్వాత సిరియా చమురు గనులమీద ఆధిపత్యం నాటో ఉమ్మడి కూటమికి చెందుతుంది. అందులో సింహభాగం అమెరికా లేదా రష్యా దక్కించుకోవచ్చు. ఇక్కడే పంపకాల బెడద మొదలవుతుంది.
ఇటలీ దేశానికి చెందిన లాస్టాంపా అనే దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం క్యాలిఫోర్నియాలోని హత్యాకాండకు కారకులైన ఉగ్రవాదుల జంటలో భార్య పేరు తస్వీన్ మాలిక్. ఈమె ముల్తాన్ (పాకిస్తాన్)లోని ఉగ్రవాద మదరసాలో విద్యనభ్యసించింది. అమెరికా బ్రిటన్ యు-ఎ-ఇ ఇండియాల నుండి తమ రిక్రూట్‌మెంటు సెంటర్లద్వారా వీరు ఉగ్రవాద కార్యకర్తలను సేకరిస్తున్నట్లు తేలింది. క్యాలిఫోర్నియా కాల్పుల తర్వా త అమెరికా రాజకీయాలు వేడెక్కాయి. రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ (8-12-2015) అమెరికాలోపలికి ఇక ముస్లిములను ఎవ్వరినీ అనుమతించవద్దు- అని కోరారు. ఇతడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థి. కాబట్టి ఈ ప్రకటన అమెరికా రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అంటే ట్రంప్ ప్రకటన ఒబామా పార్టీ రాజకీయ అస్తిత్వానికి సవాలుగా మారుతుందని అర్థం.
భూసొరంగాలల్లో దాగిన ఐసిస్ ఉగ్రవాదులను రష్యా బయటకు తెప్పించింది. 10 ప్రధాన ఉగ్రవాద స్థావరాలు నిర్మూలింపబడ్డాయి. రష్యా సైనికులు అక్కడే స్థిరంగా తిష్టవేసుకొని కూర్చున్నారు. అంటే రష్యా నిజాయితీని ఎవ రూ శంకించలేరు. యుద్ధం ముగిసేవరకు అబూ అహ్మద్- అల్ అద్నానీలు సిరియాలోని ఐసిస్ ప్రధాన కార్యాలయంలో దాక్కున్నారు. అక్కడ ఐసిస్ అధికారులను బయటకు తెప్పిం చి హతమార్చాలనేది రష్యా వ్యూహం. దీన్ని టర్కీ ఎందుకు వ్యతిరేకిస్తున్నది?! అంటే ఐసిస్‌కు టర్కీకి ప్రత్యక్ష-పరోక్ష సంబంధాలున్నట్లు పసిపిల్లవాడికి కూడా అర్థం అవుతూనే ఉంది. ఒకవేళ ఐసిస్‌పై రష్యా విజయం సాధిస్తే అసద్-వ్లాదిమర్ పుతిన్‌ల మైత్రి బలపడుతుంది. ఇది అమెరికాకు ఇష్టంలేదు. వారికి ఐసిస్ నిర్మూలన ఎంత ముఖ్యమో అక్కడి చమురు క్షేత్రాలపై తమ ఆధిపత్యం కూడా అంతే ముఖ్యం- ఇదీ సంగతి! అందుకని వారు ఐసిస్ అద్నానీతోబాటు సిరియా అధినేత బషీర్ అసద్‌ను కూడా నిర్మూలించాలని అనుకుంటున్నారు. ఇందులో మరో విచిత్ర కోణం కూడా ఉంది. టర్కీలో మూడు ప్రధాన ముస్లిం వర్గాలున్నాయి. అవి సున్నీ-షియా-కుర్దులు- ఒక్క సున్నీ జాతిని తప్ప షియా-కుర్దు జాతులు రెండింటినీ ఐసిస్ నిర్మూలించాలని అనుకుంటున్నది. సున్నీ ముస్లింలు షియాలను చాలా నీచంగా చూస్తారు. సున్నీలు మహమ్మద్ ప్రవక్తను షియాలు హుస్సేన్‌ను గౌరవిస్తారు. ఇంతే తేడా! పీర్ల పండుగ చేసేవారంతా షియాలు. ఐసిస్...యూదు హిందూ కుర్దు- క్రైస్తవ జాతులతోబాటు తమను వ్యతిరేకించే ముస్లిములను కూడా హతమారుస్తున్నది. ఖలీఫా సామ్రాజ్యస్థాపన అనేది కేవలం ఒక నెపం. చమురు వ్యాపారం ద్వారా అనంత నిక్షేపాలు సంపాదించుకోవటం మరి లక్ష్యాలల్లో ఒకటి
కెనడాలో మారిన రాజకీయ అధికార పరిస్థితుల దృష్ట్యా అక్కడి ప్రధాని రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిది ఐసిస్ స్థావరాలపై దాడులుచేసే తమ విమానాలను సంయుక్త (ఎలైన్) సైన్యంనుండి ఉపసంహరించటం. సిరియా నుండి వస్తున్న శరణార్థులను కెనడా పౌరసత్వం ఇచ్చి ఆదరించటం. సిరియా అంతర్యుద్ధం వల్ల వారి ఆర్థిక వ్యవస్థ పతనమయింది. అనధోలియా సమాచార కేంద్రం ఇచ్చిన వార్తల ప్రకారం టర్కీలో ఐసిస్ అనుకూల ట్విట్టర్‌లను నిషేధించినట్లు తెలుస్తున్నది. ఇది సకారాత్మక చర్యగా పైకి కనబడినప్పటికీ వ్యూహాత్మకంగా టర్కీ తాను ఉగ్రవాద వ్యతిరేక శక్తి అని నిరూపించుకోవటంకోసం చేసిన పని అని భావిం చాలి. టర్కీకి నిజాయితీ ఉంటే ఐసిస్ నుండి నూనె కొనటం ఆపివేయాలి.
డిసెంబర్ 10 నాడు అమెరికా సైన్యం జరిపిన దాడులల్లో మువాషక్ ముస్త్ఫా, మహమ్మద్ అల్-కర్మేష్, మరొక ఇద్దరు సీనియర్ నాయకు లు చనిపోయారు. వీరు ఐసిస్ ఉద్యమానికి ప్రధానంగా ఆర్థిక వనరులు సమకూర్చే కీలక వ్యక్తులు. కాందహార్‌లో హైసెక్యూరిటీ ఎయిర్‌బేస్ క్యాంప్ మీదికి పదకొండు మందితో కూడిన ఆత్మాహుతి దళ కార్యకర్తలు దాడి చేశా రు. అక్కడ నాటో (యుఎస్) రక్షణ దళాలు కూడా ఉన్నాయి. ఈ దాడిలో యాభై మంది చనిపోయారు. దీంతో పాకిస్తాన్ ‘శాంతి చర్చలకు’ ఆహ్వానం పంపింది- ఈ వార్తలు దేన్ని తెలుపుతున్నాయ? ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం నేడు అగ్రవాదం అయింది- ఇందుకు మూలాలు బీజాలు ఇస్లాం నుండి వ్యాపించాయి. ఇది కాదనలేని ప్రత్యక్ష సత్యం. ఈ కారణం చేత రిపబ్లికన్ పార్టీ అధినేత (అధ్యక్ష పదవి అభ్యర్థి) ట్రంప్, అమెరికాలోని ఉగ్రవాద ముస్లిములకు వీసా అనుమతినివ్వవద్దని కోరాడు. అమెరికా ద్వంద్వ ప్రమాణాలను వేలెత్తిచూపేవారు చెప్పేదేమంటే పరోక్షంగా అమెరికాయే ఈ చమురును కొని ఉగ్రవాదానికి లోగడ మద్దతును ఇచ్చింది అని- అమెరికాలో నూనె బావులున్నాయి. ఐతే వాటిని 22వ శతాబ్దపు అవసరాలకోసం దాచిపెట్టి ప్రస్తుతానికి ఇస్లామిక్ దేశాల చమురు నిల్వలమీదనే ఆధారపడుతున్నది.
అమెరికా విదేశాంగ కార్యదర్శి స్వయంగా మాస్కో వెళ్లి వ్లాదిమర్ పుతిన్‌తో చర్చించారు. ఇప్పుడు ఉమ్మడి వ్యూహం ద్వారా ఉగ్రవాదాన్ని మట్టుపెట్టగలమని వారు అభిప్రాయపడ్డారు. ఈ చర్యలో నిజాయితీ ఉంటే తప్పనిసరిగా ఇది ఆహ్వానించదగిన పరిణామమే. ఇదే సమయంలో సౌదీ అరేబియా 34 దేశాలతో కలిసి ఉగ్రవాద వ్యతిరేక కూటమి ఏర్పాటుచేయటం గమనార్హం. అంటే ముస్లిం దేశాలు తమనుతాము ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని అర్ధం. చమురు నిక్షేపాలు అధికంగా ఉన్న సౌదీ వంటి దేశాలల్లో బాంబుదాడులు జరిగితే వారే కాదు ఎన్నో దేశాలు నష్టపోతాయి. అంతర్జాతీయంగా చమురు అందుబాటులోకి రాకుండాపోతుంది. అందుకని శత్రువు యొక్క ఆర్థిక మూలాలు ధ్వంసంచేయాలన్న లక్ష్యంతో ఐసిస్ చమురు వ్యాపారాన్ని సంయుక్త సైన్యం దెబ్బతీసింది. డిసెంబరు 2015లో వారి వ్యాపా రం 48 మిలియన్ డాలర్లకు పడిపోయింది. 400 ఆయిల్ టాంకర్లను ఈ ఏడాదిలో ధ్వంసం చేశారు. అమెరికన్ రిపబ్లికన్ నాయకుడు ట్రంప్ మాట్లాడుతూ ఐసిస్ రిక్రూట్‌మెంట్ సెంటర్లను దెబ్బతీయటంకోసం వారి ఇంటర్‌నెట్ సౌకర్యాలను మూసివేయాలని సూచించారు. ఐసిస్ దాడుల భయంతో వాషింగ్టన్‌లో స్కూళ్లు మూతపడ్డాయి. హైదరాబాదు ముంబాయి ఢిల్లీ వంటి నగరాలు అప్రమత్తంగా ఉండాలని నిఘా విభాగాలు హెచ్చరించాయి. ఎలాగైనా బషీర్ అసద్‌ను శాంతి ప్రక్రియలో భాగం చేయాలని రష్యా యోచిస్తున్నది. అందుకు జాన్‌కెర్రీ అంగీరించినట్లు కన్పించటం వ్యూహాత్మకం కావచ్చు.
ఐక్యరాజ్య సమతివారి ‘శాంతి సైన్యం’లో చేరడానికి భారత్ అంగీకరించడంతో ఇది స్పష్టంగా ప్రపంచ యుద్ధకళను సంతరిం చుకుంది. అంటే 1945 నాటి పరిస్థితులు ఇలాగే ఉన్నాయని గుర్తుకు తెచ్చుకోవచ్చు. సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ డిసెంబర్ 18న మాట్లాడుతూ ‘ఇప్పుడు మన సమస్య అబూ బకర్ అల్ (జిహాదీ)యే కాని, బషర్ అల్ అసద్ కాదని’ అనడంలో తాత్పర్యమేమిటంటే అసాద్‌ను పదవినుండి తొలగించాలని అమె రికా ఇప్పుడు..ఈ క్షణంలో పట్టుపట్ట కూడదని. ఎందుకంటే ఐసిస్ అంతర్జాతీయ ఉగ్రవాద సమస్య. అసాద్ పాలన సిరియాకు మాత్రమే పరిమితమైన స్థానిక సమస్య.
భారతదేశంలోని సామ్యవాదులు, ముస్లిం వర్గాల వారు అబూబకర్ అల్ బాగ్దాదీని నిర్ద్వం ద్వంగా ఖండించడం లేదు. దీనివల్ల 1940 దశకంలోని ఖిలాఫత్ ఉద్యమ వాతావరణం ఏర్పడుతున్నదని గ్రహించాలి. ఇదిలావుండగా ఇటీవల పూనాలో ఒక అమ్మాయని నిఘా వర్గాలవారు ఐసిస్ వారి చక్రబంధం నుండి వి ముక్తం చేశారు. త్వరలో నారత్‌పై ఐసిస్ విరు చుకుపడబోతున్నదనే సమాచారం అందింది. బెలూచిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కాశ్మీర్ మీదుగా ఖలీఫా రాజ్య నిర్మాణం జరుగాలనే బ్లూ ప్రింట్ రూపొందింది. ఇందుకు హైదరా బాదు, బిహారు, పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలనుండి మద్దతు కూడగట్టు కునే ప్రయత్నాలు మొదలైనాయ.

- ముదిగొండ శివప్రసాద్