ఆంధ్రప్రదేశ్‌

నిరుద్యోగ భృతిపై పునరాలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సామర్థ్యాల శిక్షణవైపు మొగ్గు!
* హామీల అమలుపై అయోమయంలో టిడిపి

హైదరాబాద్, మార్చి 11: ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని, లేకుంటే ఉపాధి కల్పిస్తామని అదీ సాధ్యం కానంత వరకూ యువతకు నిరుద్యోగ భృతిని రెండు వేలు చొప్పున ఇస్తామని చెప్పిన రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతం ఇరకాటంలో పడింది. రాష్ట్రంలో అధికారికంగానే ఎనిమిదిన్నర లక్షల మంది నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజిల్లో నమోదై ఉన్నారు. వీరికి రెండు వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే నెలకు 170 కోట్లు వరకూ ఖర్చవుతుంది. అంటే ఏటా 2వేల కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుంది. ఇంతా చేసినా అవి నిరుద్యోగులకు నేరుగా చేరుతాయనే నమ్మకాలు తక్కువగా ఉన్నాయి. వీటిలో అక్రమాలకు తావిచ్చినట్టు కూడా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
జాబు రావాలంటే బాబు రావాలి అని పేర్కొంటూ ఇంటింటికీ రాసిన లేఖలు కూడా ఎన్నికల్లో ఓట్లను సంపాదించడానికి బాగా పనిచేశాయని చెబుతున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగ భృతి హామీని అమలుచేసే అంశంపై చాలాకాలంగా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైకాపా ఈ అంశాన్ని ప్రశ్నోత్తర కార్యక్రమంలో ప్రస్తావించి ప్రభుత్వ తీరును ఇప్పటికే దుయ్యబట్టింది. వైకాపా నేతలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ వాకౌట్ కూడా చేశారు. బడ్జెట్‌లో ప్రభుత్వం యువత సాధికారత కోసం 252.38 కోట్లు ప్రతిపాదిస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధికోసం 376.39 కోట్లు, క్రీడలకోసం 215.38 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఆంధ్రాలో 15 నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్న వారు 3.4 కోట్ల మంది ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో ఇది 67 శాతం వరకూ ఉంది. 18 నుండి 35 సంవత్సరాలున్న వారు 31 శాతం మంది ఉన్నారు. యువత సాధికారికతకు ఒక సమగ్ర విధానాన్ని ప్రకటించడంతో పాటు రైతు సాధికార సంస్థల తరహాలో ఒక సంస్థాగత నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం ప్రతిపాదించబోతోంది. ప్రజాసేవలకు సంబంధించిన 12,358 పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా నింపడానికి ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న కాలంలో మరో 20వేల పోస్టులను నోటిఫై చేయనున్నారు. రానున్న రోజుల్లో యువతకు నైపుణ్యాల అభివృద్ధికి గానూ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రపంచంలోని పది నైపుణ్య కేంద్రాల్లో రాష్ట్రాన్ని కూడా ఒకటిగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ యోచనగా ఉంది. బడిమానేసిన వారు, ఐటిఐలు, డిప్లొమో హోల్డర్లు, పట్ట్భద్రులు, ఇంజనీరింగ్ విద్యార్ధులకు ప్రత్యేక కౌశలాలను అందిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్‌ను నెలకోల్పింది. పారిశ్రామిక రంగాన్ని భాగస్వామ్యం చేసి రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా నైపుణ్యాలను అందిస్తారు. రానున్న రోజుల్లో నిరుద్యోగ భృతికి బదులు నైపుణ్యాలను అందించడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోంది.