రాష్ట్రీయం

ఉప్పల్‌లో విధ్వంసం సృష్టించిన హిజ్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉప్పల్ రింగ్‌రోడ్డులో హిజ్రాలు ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం అర్థరాత్రి సమయంలో హిజ్రాలు, పాదాచారులపై, వాహనదారులపై, కారుల్లోని ప్రయాణీకులపై దాడులకు పాల్పడ్డారు. అడ్డువచ్చిన వారిని కొడుతూ వారి మెడల్లో ఉన్న బంగారు గొలుసులు, ఆభరణాలు, పర్సులను, మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. బాధితులు సమీపంలోని పోలీసు స్టేషన్‌కు పరుగులు పెట్టగా అక్కడకు కూడా గుంపుగా వెళ్లి విధ్వంసం సృష్టించారు. పోలీసు స్టేషన్‌లోని పూల కుండీలను ధ్వంసం చేశారు. తగినంత మంది పోలీసులు లేకపోవటంతో వారిని ఆపేవారు లేకుండా పోయారు. అడ్డు వచ్చిన ముగ్గురు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఎసీపీ గాంధీ నారాయణపై కూడా దాడి చేసి కొట్టారు. గాయపడిన కానిస్టేబుళ్లు, బాధితులను ఆసుపత్రికి తరలిస్తుండగా అపుడు కూడా వెంటపడి దాడికి ప్రయత్నించారు.