సబ్ ఫీచర్

వేదం ఆమె నాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఋషులు మనకు అందించిన సంపద వేదాలు. మనిషి ఎలా నడచుకోవాలో వివరించిన ఆ వైదిక ధర్మాన్ని నేడు మనం పాటించకపోగా అపహాస్యం చేసే పెడధోరణిలో వెళుతున్నాం. సనాతన ధర్మాన్ని నలుదిశలా వ్యాపింపజేసేందుకు ఎంతోమంది తమ జీవితాశయంగా బతికేవారు ఉన్నారు. అలాంటి కోవకు చెందుతారు శ్రీమతి పద్మావతి. పెద్దగా చదువుకోకపోయినా తండ్రి బాటలో నడుస్తూ వేద ప్రచారం చేస్తూ యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నారు. ఆర్య సమాజ బాధ్యతను తన భుజ స్కంధాలపై వేసుకుని ముందుకు సాగుతున్నారు.

మహర్షి దయానంద సరస్వతి పునరుద్ధరించిన వైదిక ధర్మం ఈ నాటికి ఆర్య సమాజం పేర ముందుకు సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు, తెలంగాణ పట్టణాలో, కోస్తా ప్రాంతంలో, తెనాలి, గుంటూరు తదితర చోట్ల ఆర్య సమాజం ప్రచారంలో వుంది. సీమ జిల్లాల్లో ప్రచారంలో లేదు. అలాంటి ఈ ప్రాంతంలో 40 సంవత్సరాల క్రింద ఘంటా చెంచయ్య ఆయన భార్య కర్నూలు పట్టణంలో వేసిన ఆర్య సమాజం బీజానికి కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన పండిత వంకం సుబ్బన్న నీరు పోసి జమ్మలమడుగు ప్రాంతంలో మొక్కగా మొలకెత్తించారు.
కాల గమనంలో పండిత వంకం సుబ్బన్న గతించిపోగా ఆయన కూతురు శ్రీమతి పద్మావతమ్మ ఆర్య సమాజ బాధ్యత, వేద ప్రచారం ప్రతి పౌర్ణమికి రుద్రయాగం ఆర్య సమాజ పద్ధతిన శోడశ సంస్కారాలు చేయడం ప్రారంభించారు. పెద్దగా చదువుకోని ఆమె తండ్రి వద్ద నిత్యం వేద ధర్మ విషయాలు తెలుసుకొని ప్రేరణ పొంది తన జీవితాన్ని తండ్రి ఆశయ సాధనలో నిమగ్నమైంది. నిత్యం ఆర్య సమాజ ప్రచారం గావిస్తున్నారు. మహిళ, అందునా భర్త ఇటీవలే చనిపోయినా.. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోయినా తోటి ఆర్య సమాజీకుల సహకారంతో ఎంతో క్లిష్టమైన ఆర్య సమాజ భారం వహించింది.
నేటి హిందూ సమాజంలో వున్న మూఢాచారాలు ఆర్య సమాజంలో లేవు. కుల మత భేదాలు లేవు. బ్రాహ్మణేతరులే ఎక్కువగా పౌరోహిత్యం వహిస్తున్నారు. వారు శోషశ కర్మలు, సీమంతం, నామకరణం, వివాహం మొదలగు అంత్యేష్టి వరకు గల 16 సంస్కారాలు చేయగలరు. ఆర్యసమాజంలో మంచి దినాలు, చెడ్డ దినాలు లేవు. విగ్రహారాధన లేదు. ఇతర మతస్తులు చేరే అవకాశం వుంది. వేదములే దైవగ్రంధముగా భావిస్తారు. అత్యంత పురాతనం, అత్యంత ఆధునికమైన ఆర్య సమాజము (వేదిక) ధర్మం) ప్రచారం నేడు ఎంతో అవసరం. ప్రపంచ శాంతి లభించాలంటే వేద ప్రచారం జరగాలి. వేదములలో మానవునికి కావలసిన సమస్త విజ్ఞానం వుంది. ఇంతటి గొప్ప వేద ఆచారాలు నిర్వహిస్తున్న శ్రీమతి పద్మావతమ్మ మరింత ముందుకు సాగాలని కోరు కుందాం.

-నుగ్గు జనార్దన