మెయిన్ ఫీచర్

వ్యామోహమే ఇంతపని చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారిని కూడా కేవలం ఒకే ఒక బలహీనత అధఃపాతాళంలోకి అతి సులువుగా నెట్టివేయగలదు. అటువంటి ఒక భయంకరమైన బలహీనతే పరవ్యామోహం.
ఒక వ్యక్తి మనస్సును అదుపులో పెట్టుకోలేనప్పుడు ఇటువంటి పెను ప్రమాదం పొంచి ఉంటుంది అనే విషయం మనిషి అన్నవాడు తప్పక తెలుసుకోవాలి. పర వ్యామోహం ఒక విచిత్రమైన మానసిక స్థితిగా చెప్పుకోవచ్చు. కేవలం ఊహాజనిత అసంతృప్తితో బాధపడుతూ ఉండేవారే ఈ వ్యామోహం బారినపడతారని శాస్తజ్ఞ్రులు అంటూ ఉంటారు. పర వ్యామోహమన్నది పలు రకాలుగా ఉండవచ్చు. అది విదేశీ వ్యామోహం కావచ్చు, పర భాషా వ్యామోహం కావచ్చు, పర సంస్కృతి వ్యామోహం కావచ్చు, పర స్ర్తి వ్యామోహం కావచ్చు, పర పురుషుణ్ణి కామించడం కావచ్చు. ఇక్కడ పర వ్యామోహం కేవలం మగవారికి మాత్రమే పరిమితం కాదనేది చేదు నిజం. కనుక స్ర్తి పురుష భేదం లేకుండా అందరూ జాగరూకులే ఉండాలి.
మనిషికి ఏ విధమైన పర వ్యామోహం కూడా వాంఛనీయం కాదు అనే చెప్పుకోవాలి. ఆ వ్యామోహం మనలను అనేక కష్టనష్టాలకు, భయభ్రాంతులకు గురిచేస్తుంది అనేది నిర్వివాదాంశం.
అతి సామాన్యులనుంచి అత్యున్నత స్థానాలలో వున్న మనుషుల వరకు ఈ వ్యామోహం కొంతమందిని పట్టి పీడిస్తుంది.
పౌరాణిక యుగంలో కూడా ఈ వ్యామోహం యొక్క లక్షణాలు కొంతమందికి ఉన్నాయని మనం చదువుకున్నాం. చారిత్రక కాలంలో ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. నేటి ఆధునిక యుగంలో కూడా ఇటువంటి మానసిక వైపరీత్యాలు చూస్తున్నాం. కనుక కాలానికి, యుగానికి అతీతంగా ఈ పర వ్యామోవహం విజృంభిస్తోంది అని మనం గమనించవచ్చు.
అయితే ఇందులో పరదేశి వ్యామోహం, పరభాష వ్యామోహం లాంటి కొన్ని వ్యామోహాలు అంత ప్రమాదకరమైనవి కాకపోవచ్చు. కానీ కొన్ని మాత్రం అత్యంత వినాశకరమైనవి.
‘పరస్ర్తి వ్యామోహం పతనానికి నాంది’ అంటారు పెద్దలు. ఎందరో మహానుభావులు, మహాపురుషులు ఇతరత్రా ఎంతో గొప్పవారు అయి ఉండి కూడా కేవలం పర స్ర్తి వ్యామోహం అనే ఒకే ఒక్క బలహీనతతో పతనం అయిపోయారు అనే విషయం మనకు పురాణాలూ, చరిత్రలు చెపుతాయి. ఈ బలహీనతవలన ఎంతోమంది రాజ్యాలు కోల్పోయారు. ఎన్నో యుద్ధాలు జరిగాయి అన్నది మనందరకు విదితమే.
మనం పురాణాలలో పరిశీలించినపుడు ఎంతో గొప్పవాడయిన రావణుడు కేవలం పర స్ర్తి వ్యామోహం వలన సర్వనాశనం అయిపోయాడు అని గ్రహిస్తాం. అలాగే ఆ వ్యామోహంవలనే భస్మాసురుడు, అంధకాసురుడు కూడా తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకున్నారు.
రావణాసురుడు రాక్షస రాజు అయినప్పటికీ మహాభక్తుడు. వేదాలను ఔపోసన పట్టినవాడు. పరమ నిష్ఠతో మసలుకునేవాడు. ఎంతో నీతిమంతుడు. పరమ శివుణ్ణి మెప్పించి అనేక వరాలను పొందినవాడు. లంకాధిపతిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అటువంటి మహానుభావుడు తనలోని ఒకే ఒక బలహీనతతో తన, తనవారి వినాశనం కోరి తెచ్చుకున్నాడు. ఆ బలహీనతే పర స్ర్తి వ్యామోహం. అదే లోకజనని సీతపై కోరిక పెంచుకోవడం.
రావణాసురుడి భార్య మండోదరి నిజంగా సహధర్మచారిణి. ఆమె కూడా సకల శాస్త్రాలు చదువుకున్నది. మంచి చెడులు, ఉచితానుచితాలు తెలిసినది. భర్తకి అన్ని విషయాలలో చేదోడుగా వాదోడుగా వుండేది. రావణాసురుని అన్ని విషయాలలో ఎంతో సహాయ సహకారాలు అందించేది.
‘వినాశకాలే విపరీత బుద్ధిః’ అన్న చందాన చెడు కాలం దాపురించేసరికి ఎవరికైనా పెడ బుద్ధులు పుట్టుకొస్తాయి. ఇంకొక వైపరీత్యం ఏమిటంటే, వాళ్ళకి మంచి మాటలు, వాళ్ళని సక్రమ మార్గంలో మళ్లించే వచనాలు అసలు రుచించవు. దానికా రావణాసురుడు కూడా అతీతుడు కాలేకపోయాడు.
రావణాసురుడుకి అనేకమంది మహాసాధ్వి సీతాదేవి గురించి వివరించి, ఆవిడని గురించి చెడుగా తలంచవద్దని, ఆమెను సగౌరవంగా రామునికి అప్పచెప్పమని, అది చేయకపోతే లంకకు వినాశనం తప్పదని హెచ్చరించారు. కానీ పర స్ర్తి వ్యామోహంలో పడ్డ రావణాసురుడికి అవేవి రుచించలేదు.
త్రిజట అనే రాక్షస స్ర్తి అశోకవనంలో సీతాదేవికి కాపలాగా ఉండేది. ఆమె ఆంజనేయుడు వచ్చిన వృత్తాంతాన్ని, ఆయన సృష్టించిన విధ్వంసాన్ని గురించి రావణునికి తెలిపింది. అలాగే తనకు వచ్చిన ఒక కల గురించి, అందులో లంకకు జరిగిన అపార నష్టాన్ని గురించి రావణుడికి వివరించి సీతని వదిలివేయమని, అలా చేయకపోతే లంకకు, లంకాధిపతి అయిన రావణుడికి కలిగే ప్రమాదం గురించి హెచ్చరించింది. కానీ ఆమె మాటలు అన్నీ రావణాసురుడి ముందు చెవిటివానిమందు పూరించే శంఖపు ధ్వనులే అయ్యాయి. కారణం రావణుని బలీయమైన పర స్ర్తి కాంక్ష.
అలాగే రామ రావణ యుద్ధకాలంలో మండోదరి చేసిన హెచ్చరికలు, అభ్యర్థనలు కూడా నిష్ఫలమయ్యాయి. చివరకు అంతటి ధర్మశీలుడు, అరివీర భయంకరుడు, శివభక్తుడు అయిన రావణాసురుడు నాశనం అయ్యాడు. రావణుని ఉదంతం పర స్ర్తిని కోరుకోవడం ఎంతటి వినాశకరమో తెలుపుతుంది.

-ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్