ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ చార్జీల పెంపుపై 2నుంచి బహిరంగ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఆంధ్ర డిస్కాంలు, జెన్కో, ట్రాన్స్‌కో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.783 కోట్ల విద్యుత్ చార్జీల పెంపుదలపై ఇచ్చిన ప్రతిపాదనలపై ఏపిఇఆర్‌సి బహిరంగ విచారణను మార్చి 2వ తేదీ నుంచి నిర్వహించనుంది. మార్చి 2వ తేదీన శ్రీకాకుళంలోని విద్యుత్ సూపరింటెండింగ్ కార్యాలయంలో, మార్చి 3వ తేదీన విశాఖపట్నంలోని ఏపిఇడిసిఎల్ కాన్ఫరెన్సుహాలులో, 5వ తేదీన అనంతపపురంలోని ఎస్‌ఇ సర్కిల్ ఆఫీసు కాన్ఫరెన్సుహాలులో, 9వ తేదీన విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ క్యాంపస్ ఆడిటోరియంలో, 10వ తేదీన తిరుపతిలోని ఏపిఎస్‌పిడిసిఎల్ కాన్ఫరెన్సుహాలులో నిర్వహిస్తారు. చివరి బహిరంగ విచారణను మార్చి 14వ తేదీన హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ ఏపిఇఆర్‌సి కాన్ఫరెన్సు హాలులో నిర్వహిస్తారు.
కాగా రెండు డిస్కాంలు రూ.5148 కోట్ల రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు రూ.783 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపిఇఆర్‌సిని కోరాయి. మొత్తం రూ.5148 కోట్ల లోటులో ప్రభుత్వం రూ.4364 కోట్ల సబ్సిడీని ఇస్తుందనే ఆశాభావంతో ఏపి డిస్కాంలు ఉన్నాయి. కనీసం మూడు శాతం మేర విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపి డిస్కాంలు ఏపిఇఆర్‌సిని కోరాయి. ఏపి సదరన్ పవర్ డిస్కాం రూ.488.35 కోట్లు, ఇపిడిసిఎల్ రూ. 294 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచాలని కోరాయి. 2015-16 సంవత్సరానికి రూ. 6455 కోట్ల మేర లోటును భర్తీ చేసుకునేందుకు రూ.1250 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచేందుకు ఏపిఇఆర్‌సి అనుమతి ఇచ్చిన విషయం విదితమే. రూ. 3186 కోట్లను సబ్సిడీ రూపంలో భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఏడాది కూడా రూ. 4వేల కోట్ల మేర సబ్సిడీని భరించే విషయమై ప్రభుత్వం బహిరంగ విచారణ సమయంలో ఏపిఇఆర్‌సికి తెలియచేస్తుంది.