చిత్తూరు

కాల్‌మనీ ఫిర్యాదులతో పోలీసుల అర్ధరాత్రి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక
పెద్దదిక్కును పోగొట్టుకున్నాం
* డిఎస్‌పిని ఆశ్రయించిన తల్లీ, కుమార్తెలు
* మదనపల్లెలో హడలిపోతున్న వడ్డీ వ్యాపారులు
మదనపల్లె, డిసెంబర్ 18: కాల్‌మనీ వ్యవహారం రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు చిన్నపాటి పల్లెప్రాంతాలలో కూడా వడ్డీవ్యాపారుల వేధింపులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాల్‌మనీ వ్యవహారం చర్యలు తీసుకోవాలని, ఇందుకు ఎవరైనా వత్తాసుపలికినా వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్న కచ్చిమైన ఆదేశాలు రావడంతో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రెండురోజుల కితం మదనపల్లె పట్టణం కదిరిరోడ్డుకు చెందిన టచ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌కు చెందిన 15మంది కుటుంబసభ్యులు ఇద్దరు వడ్డీవ్యాపారులపై ఫిర్యాదులు చేయడంతో మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగి, పట్టణంలో వడ్డీవ్యాపారి ఇళ్ళల్లో పోలీసులు సోదాలు నిర్వహించగా అప్పటికే ఇద్దరు పరారీలో ఉన్నారు. నాభర్త ఆత్మహత్యకు చీటీల సుశీలమ్మ, క్రిష్ణప్ప, ప్రసాద్‌లే కారకులు: ఇదిలావుండగా మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ కొత్తిండ్లుకు చెందిన భార్య పూలకామాక్షమ్మ, కుమార్తె శుక్రవారం డిఎస్‌పిని ఆశ్రయించారు. నాభర్త పెయింటింగ్ పనులు చేసుకుని ఉన్న ఒక్క కుమార్తెను పోషించు కుంటున్నాం. రెండేళ్ళకితం బంధువైన ప్రమీలమ్మ మోతీనగర్‌లో నివాసముంటు వడ్డీవ్యాపారం చేస్తున్న చీటీల సుశీలమ్మవద్ద డబ్బులు తీసుకుంది. ఇందుకు తన భర్తను సాక్షంగా పెట్టుకున్నారు. దీంతో బంధువైన ప్రమీలమ్మ అప్పులుచేసి ఊరొదలి పరారైయ్యారు. దీంతో చీటీల సుశీలమ్మ, ఆమె కుమారుడు ప్రసాద్ మా ఇంటిపైకి వచ్చి నాభర్తను తీవ్రంగా చితకబాదారు. 2013 డిసెంబర్ 29, 30వతేదిలలో తనభర్తను వారింటివద్ద నిర్భందించి ఇంటిని రిజిస్ట్రర్ చేయించుకున్నారు. అంతేకాకుండా 2014న జూన్ మాసంలో తన కుమార్తె చదువులకోసం పొదుపుచేసుకున్న రూ.15వేలను వడ్డీరూపంలో సుశీలమ్మ, కుమారుడు ప్రసాద్ బలవంతంగా లాక్కెల్లారు. దీంతో నా కుమార్తె చదువు ఆగిపోయింది. రెండేళ్ళపాటు సుమారు రూ.2.50లక్షల వరకు వడ్డీలు కట్టాం. అయితే తీసుకున్న సొమ్ముకు ఉన్న ఇల్లు సరిపోతుందని, ఇందుకు ఇళ్ళు ఖాళీ చేయాలని పలుమార్లు సుశీలమ్మ, కుమారుడు ప్రసాద్‌లతో పాటు మరికొందరితో నాభర్తను తీవ్రంగా కొట్టడంతో అవమానం భరించలేక నాభర్త 2015 అక్టోబర్ 22న ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కూలీపనులు చేసుకుని జీవనం సాగిస్తున్న మాపై గత వారంరోజులుగా సుశీలమ్మ, ఆమె ప్రియుడు క్రిష్ణప్ప, కుమారుడు ప్రసాద్‌లు ఇళ్ళు ఖాళీచేయాలని ఒత్తిడి చేయడంతో పాటు చంపేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితులు శుక్రవారం మదనపల్లె సబ్‌కలెక్టర్, డిఎస్‌పిలను ఆశ్రయించి కన్నీటితో మొరపెట్టుకున్నారు.
వడ్డీలు చెల్లిస్తున్నా.. నాభార్యపై దాడి చేశారు: బతుకు జీవనం కోసం పట్టణంలోని బెంగళూరు బస్టాండు సర్కిల్‌లో చికెన్ పకోడా అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా.. వ్యాపారం కోసం అప్పులు చేశాను. రోజువారి వ్యాపారంలో వడ్డీలకు, డైలీ కలెక్షన్‌లు చెలిస్తున్నా.. అప్పులు తీసుకునే సమయంలో తాను రాసిచ్చిన బాండ్లు, చెక్‌లు తిరిగి ఇవ్వడం లేదని మదనపల్లె పట్టణం కోటవీధికి చెందిన షేక్‌అప్సర్ మదనపల్లె వన్‌టౌన్ సిఐ శివన్నకు ఫిర్యాదు చేశారు. పట్టణానికి చెందిన చాపలరెడ్డెమ్మ వద్ద రూ.30వేలు తీసుకుని రోజువారి వడ్డీవంతున రూ.2లక్షల వరకు వడ్డీలు చెల్లించాను, చక్రవడ్డీతో కలుపుకుని రూ.లక్ష వరకు చెల్లించాల్సివుందని ఇంటివద్దకు వచ్చి దురుసుగా మాట్లాడటంతో పాటు అడ్డొచ్చిన నా భార్యపై దాడిచేయడంతో ఆమె పుట్టినింటికి వెళ్ళిపోయిందన్నారు. ప్యారానగర్‌కు చెందిన షాజహాన్ వద్ద రూ.30వేలు విలువగల కంజుపక్షులు తీసుకోగా.. రోజువారి కలెక్షన్ వంతున చెల్లించాలని చెప్పి.. వడ్డీరూపంలో రూ.లక్షలు వసూళ్ళుచేసుకుని, ఇంకా రూ.రెండులక్షలు అప్పుందని బెదిరిస్తున్నారని, పట్టణానికి చెందిన అహమ్మదీ వద్ద రూ.15వేలు అప్పుగా తీసుకుని చెల్లించేశాసినా.. రూ.1.50లక్షలు అప్పున్నుట్లు సృష్టించి బెదిరించి తనవద్ద ఖాళీచెక్‌లు లాక్కొన్నారని వాపోయారు. అంతేకాకుండా వ్యాపారం కోసం రోజువారి కలెక్షన్‌లపై తీసుకున్న అప్పులు పూర్తిగా చెల్లించినా బాండ్లు, చెక్‌లు ఇవ్వకుండా మరింత అప్పుతీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు బాధితుడు అప్పర్ పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదులపై పోలీసుల దాడులు:- రోజురోజుకు వస్తున్న కాల్‌మనీ బాధితుల ఫిర్యాదులపై పోలీసులు అర్ధరాత్రి వేళల్లో వడ్డీవ్యాపారుల ఇళ్ళపై దాడులు నిర్వహిస్తున్నారు. వడ్డీవ్యాపారి ఇంటివద్దకు పోలీసులు వెళ్ళి తనిఖీలు చేస్తుండటంతో వడ్డీవ్యాపారుల గుండెలలో రైళ్ళు పరుగెడుతున్నాయి. మరికొందరు ఏకంగా కర్నాటక, తమిళనాడు ప్రాంతాలకు పరారైయ్యారు. మరికొందరు ఏకంగా బయటప్రాంతాలలో తలదాచుకుని, సెల్‌ఫోన్‌లు సైతం స్విచ్చ్ఫా చేసి స్థానిక న్యాయవాధులను ఆశ్రయిస్తున్నారు.