డైలీ సీరియల్

బంగారుకల - 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాయా! నీవు నామీద ఉంచిన నమ్మకానికి నీ గురుభక్తికి నాకెంతో ఆనందంగా ఉంది. నా మఠదైవం గోపాలకృష్ణునికి అంకితంగా నేనీ బాధ్యత స్వీకరిస్తున్నాను’’ అన్నారు వ్యాసరాయలు.
కృష్ణరాయలు, తిమ్మరుసు మంత్రి, వ్యాసరాయలకు ధన్యవాదాలు తెలిపారు.
మరునాడు సభలో ఈ విషయం ప్రకటించబడింది. మొదలు సామంత దండనాథులకేమీ అర్థం కాలేదు. ఇది ఏ విపరీతానికి దారితీస్తుందోనని వాళ్ళు భయపడ్డారు. తిమ్మరుసు మంత్రి కృష్ణరాయని జన్మకుండలిలోని దోషం గురించి ఇతర వివరాలను సభాసదులకు తెలియజేశారు. సభ ఆమోదం తెలిపింది.
ఒక శుభదినాన నిండు సభలో మంత్రయుక్తగా శ్రీకృష్ణదేవరాయలు తన భుజబల సముపార్జితం, తిమ్మరుసు ధీశక్తితో విలసితం అయిన విజయనగర మహాసామ్రాజ్యాన్ని వ్యాసరాయ గురుదేవులకు అప్పగించాడు.
వ్యాసరాయలవారిని భద్రాసనంపై సగౌరవంగా కూర్చుండబెట్టి నవరత్నాలతో అభిషేకించారు. వినమిత శిరస్కుడై రాయలు నమస్కరించారు.
వ్యాసరాయలు శిష్యునికి తనపట్లగల గౌరవాభిమానాలకు చాలా సంతోషించాడు. ప్రేమార శిష్యుని కౌగిలించుకున్నాడు.
‘‘నాయనా! రుూ రాజ్యప్రేమ, నిర్మల హృదయంవల్ల నీ కీర్తి ఆచంద్ర తారార్కం నిలువగలదు’’ అని ఆశీర్వదించాడు.
తనను అభిషేకించిన నవరత్నాలను కుల మత భేదం లేకుండా బీదలకు పంచి పెట్టాడు వ్యాసరాయలు.
జన్మకుండలిలోని దోషకాలం పూర్తయేవరకు సింహాసనాన్ని వ్యాసరాయలవారే అధిష్ఠించారు. అది తొలగిపోగానే మరలా శాస్త్రోక్తంగా రాయలు సింహాసనాన్ని అధిష్ఠించారు. ఇపుడు రాయలు మబ్బు విడిచిన సూర్యుడిలా మరింత వీరప్రతాపాలతో వెలుగొందుతున్నారు.
****
రామేశ్వర శాస్ర్తీ అన్నం తిని మూడు దినాలయింది. నిరంతరం విఠల మందిరంలోనే ఉంటున్నాడు. తాను తీర్చిదిద్దిన సంగీత స్తంభాలను స్పర్శించి ఆ స్వరమాధురిని ఆనందిస్తూ కొసమెరుపులు దిద్దుతున్నాడు.
ఏదో లోకంలో వున్నట్లున్నాడు. గడ్డం పెరిగి మాసిన వస్త్రాలతో మారువేషంలో ఉన్న విశ్వకర్మలా ఉన్నాడు శాస్ర్తీ.
మంజరి రోజూ భోజనం తనే తీసుకు వస్తున్నది. కానీ అతను దానికేసి చూడటం కూడా లేదు. ఆమెనా పనికి ఎవరూ నియోగించలేదు. ఆమె కళాసక్తి అలాంటిది.
ఆ రోజు కూడా మంజరి భోజనం తెచ్చింది. కాని ఎప్పటిలా అక్కడ వుంచి వెళ్లలేదు.
‘‘అయ్యా’’ పిలిచింది. అతను ఆమెకేసి చూడలేదు. ‘నవమోహిని’ విగ్రహాన్ని తదేకంగా చూస్తూ తుది మెరుగులు గురించి ఆలోచిస్తున్నాడు.
‘‘అయ్యా! నేను మంజరిని’’
అతను ఆమెకేసి చూశాడు. అతని కళ్ళలో లిప్తపాటు మెరుపు. మళ్లీ అంతలోనే ప్రశాంత కాంతి.
‘‘అక్కడ వుంచి వెళ్ళు మంజరీ’’
‘‘లేదు స్వామీ! మూడు రోజులుగా మీరు తినటంలేదు. నేనుండగానే తినండి’’.
‘‘్ఫర్వాలేదు అక్కడ ఉంచి వెళ్ళు’’ అతని చూపులు మాత్రం ఆ శిల్పంమీదే! ఏదో లోకంలోంచి మాట్లాడుతున్నట్లు కన్పిస్తున్నాడు.
‘‘స్వామీ! మీరు ఇంతలా శ్రమపడితే ఆరోగ్యం పాడైపోతుంది. కొంచెం విశ్రాంతి కూడా అవసరం’’ మంజరి మెల్లగా చెప్పి భోజన పాత్ర అక్కడ ఉంచింది.
రెండు ఘడియల పాటు తదేకంగా అతను చెక్కే ‘నవమోహిని’ విగ్రహాన్ని చూసింది. ఆ విగ్రహంలో కుదురుకున్న స్ర్తిమూర్తిని ఎక్కడో చూసినట్లుంది. ఎక్కడ? ఎక్కడ? తటాలున విద్యుల్లతలాంటి స్ఫురణ! అది అద్దంలో తన ప్రతిబింబమే! అంటే తనలాంటి విగ్రహాన్ని ఈ రామేశ్వర శాస్ర్తీ చెక్కడం ఎంత ఆశ్చర్యమో అంతే ఆనందం!
ఆ స్ర్తిమూర్తిని మరింతగా చూడాలనిపించింది. నాట్యభంగిమలో వయ్యారంగా నిలబడి ఉంది. సర్వాభరణ భూషితురాలై ప్రేమగా చూస్తున్నది. ఆ చూపులో పారవశ్యం, తాదాత్మ్యం మమేకమైనాయి. ఆమె శిరస్సుపైనుండి ఇరుపక్కలకి జాలువారుతున్న పుష్పతోరణం మరింత అందాన్ని ప్రసాదిస్తున్నది. స్ర్తిమూర్తి విగ్రహం కొలత దాదాపు మానవ సహజమైన ఎత్తుతో నల్లశిలలో ఉంది. రామేశ్వర శాస్ర్తీ చేతిలో ‘నల్లని రాయి వెన్న, మైనంలా’ మారిందా అన్పిస్తుంది. వంపుసొంపులు, ఇంపులు, వస్త్రాలు, నగలు నఖశిఖ పర్యంతం ప్రతి అంశంలో తెలుగుదనం ఉట్టిపడుతూ చూసేవారికి పవిత్రభావాన్ని ప్రసాదిస్తున్నది. శాస్ర్తీ ఉలి విన్యాసం, హృదయ ఔన్నత్యం ఆ శిల్పంలో ప్రతిఫలిస్తున్నది.
మంజరి కళ్ళ నిండుగా నీళ్ళు. రామేశ్వర శాస్ర్తీకి ఆరాధన తనకి తెలియంది కాదు. తన నాట్యం ఒక శిల్పికి స్ఫూర్తినీయటం తనకీ ఆనందమే! కానీ తనపైన లోకంలో బతికే ఈ యువ శిల్పి భవిష్యత్ ఏం కానున్నది. విజయనగర సామ్రాజ్య కళాజగత్‌లోని ఈతని స్థానం ఏమిటి? దీనిని కాలమే నిర్ణయిస్తుంది. నిట్టూర్చి కర్తవ్య స్ఫురణతో కదిలింది.
రామేశ్వర శాస్ర్తీ విఠల మండప నిర్మాణంలో సప్తస్వర స్తంభాలను పూర్తిచేయటంలో ప్రధాన పాత్ర వహించాడు. దాని నిర్మాణం పూర్తి అయింది. కాబట్టి ప్రధాన శిల్పాచార్యుడు శాస్ర్తీని తిరుపతిలో నిర్మిస్తున్న వేయిస్తంభాల మండప నిర్మాణంలో తోడ్పడమని కోరాడు. శాస్ర్తీ మరునాడే తిరుపతికి ప్రయాణమయ్యాడు. బయలుదేరినప్పుడు శాస్ర్తీకే తెలియదు. తాను మళ్లీ ఎప్పుడీ కళానగరానికి రాగలడో! ఎప్పుడీ మంజరిని మళ్లీ చూడగలడో! మంజరికి శాస్ర్తీ తిరుమల ప్రయాణం గురించిన సమాచారం మర్నాడు అతను వెళ్లిపోయాకగానీ తెలియలేదు.

7
నవరాత్రి పండగ వేడుకలతో హంపీ పట్టణమంతా కోలాహలంగా వుంది. రాయలవార్కి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పండుగనాడు హంపీ విజయనగరం ఇంద్రలోకాన్ని తలపిస్తోంది. నగరాన్ని రంగు రంగుల రంగవల్లికలతో ఫలపుష్ప సమూహాలతో అలంకరించారు. స్ర్తి పురుషులంతా ఆకర్షణీయమైన వస్త్భ్రారణాలతో పూలమాలలు, గంధం, కస్తూరి అగరులతో శోభిల్లుతున్నారు.

- ఇంకా ఉంది

- చిల్లర భవానీదేవి